Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి : ఒకరికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికా రాష్ట్రమైన ఉటాలో ఒక ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో అనుమానితుడ్ని అరెస్టు చేసినట్టు చెప్పారు. దాదాపు 10 వేల మంది జనాభా కలిగిన గ్రాంట్స్విల్లేలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే నలుగురు పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నట్టు గ్రాంట్స్విల్లే పోలీస్ ఇన్స్పెక్టర్ రోండా ఫీల్డ్స్ తెలిపారు. వాస్తవానికి ఐదుగురిపై నిందితులు కాల్పులు జరపగా నలుగురు మృతి చెందారని వెల్లడించారు. ఐదో వ్యక్తికి సంబంధించి ఏ విధమైన సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు. నిందితుల పేర్లను కూడా పోలీసులు వెల్లడించలేదు. అయితే బాధితులు, నిందితుడు అందరూ బంధువులేనని గ్రాంట్స్విల్లే మేయర్ బ్రెంట్ మార్షల్ ధ్రువీకరించారు.