Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సి గోంచారుక్ రాజీనామాను అధ్యక్షుడు వ్లదిమిర్ జెలెన్స్కీ తిరస్కరించారు. ఆయనను ప్రధానిగా కొనసాగాలని కోరారు. అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆర్థిక వ్యవస్థపై అంతగా అవగాహన లేదని చేసిన విమర్శలకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయిన నేపథ్యంలో గోంచూరక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ కార్యాలయం శనివారం విడుదల చేసిన వీడియోలో ఇది విచారకర పరిస్థితి అని పేర్కొంది. ఓలెక్సి గోంచారుక్ను, ఆయన మంత్రి వర్గాన్ని కొనసాగవలసిందిగా కోరారు. ''ప్రజలు ఆందోళన చెందుతున్న ముఖ్యమైన సమస్యలను మీరు పరిష్కరించ గలిగితే మీకు, మీ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను'' అని జెలెన్స్కీ అన్నారు.