Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యర్థులపై శాండర్స్ విమర్శనాస్త్రాలు
లాస్‌వేగాస్: నెవాడా ప్రావిన్స్‌లో మరో వారంలో జరుగనున్న డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియ ల్ ప్రైమరీస్ కోసం ఓటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఓటింగ్ నిర్వహించిన తర్వాత చివరిగా నెవాడాలో ప్రైమరీస్ జరుగుతాయి. అయోవా, న్యూహాంప్షైర్లలో జరిగిన తొలి, మలి ప్రైమరీస్‌లో విజయం సాధించి డెమోక్రాటిక్ అభ్యర్థిత్వ రేస్‌లో శాండర్స్ ముందున్న విషయం తెలిసిందే. నెవాడా ప్రైమరీస్ ముందు లాస్‌వేగాస్ నగర శివార్లల శనివారం జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తన ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలను సంధించారు. 'ప్రజాస్వామ్యం అంటే అభ్యర్థులు తమ నిధుల కోసం శతకోటీశ్వరులను దేబిరించటం కాద'ని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి సంపన్నుల నుంచి విరాళాలు సేకరిస్తున్న మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, మరో ప్రత్యర్థి పీట్ బుటిగీగ్నుద్దేశించి ఆయన ఈ పరోక్ష వ్యాక్యలు చేశారు. బుటీగీగ్ తన ప్రచార విరాళాల కోసం రహస్యంగా సియాటెల్‌లో తన దాతలను కలుసుకున్న సమయంలో శాండర్స్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ప్రజాస్వామ్యం అంటే శతకోటీశ్వరులు కోట్లాది డాలర్లు ఖర్చు చేసి ఎన్నికైన వారిని తమ గుప్పిట్లో ఉంచుకోవటం కాదని, ఎన్నికైన వారు ప్రజల పక్షాన నిలిచి న్యాయం కోసం పోరాడినపుడే ప్రజాస్వామ్యానికి సార్ధకత చేకూరుతుందని ఆయన అన్నారు. నెవాడాలో తమ కాకసెస్ కోసం డెమోక్రాటిక్ పార్టీ నాలుగు రోజులు ముందుగానే ఓటింగ్ ప్రారంభించింది.