Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి గెలుపొందిన ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ మరోసారి గెలుపొందారు. ఆయనకు 50.64శాతం (9,23,868) ఓట్లు నమోదు కాగా, ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, నేషనల్ కొలీషన్ పార్టీ అభ్యర్థి అబ్దుల్లాకు (7,20,990) 39.52శాతం ఓట్లు వచ్చినట్టు అఫ్ఘనిస్థాన్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి హావా ఆలమ్ నూరిస్థానీ వెల్లడించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడిగా ఘనీ రెండోసారి ప్రమాణం చేయనున్నారు. అఫ్ఘాన్‌లో అధ్యక్ష ఎన్నికలు గతేడాది సెప్టెంబర్28న జరిగాయి. 90 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. కానీ, కేవలం 19 లక్షల మంది ఓటర్లు మాత్రమే ఓట్లు నమోదు చేశారు. ఈఎన్నికల్లో ఘనీ వర్గీయులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అబ్దుల్లా ఆరోపించారు. పలు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించిన అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 3లక్షల నకిలీ ఓట్లు నమోదయ్యాయని అన్నారు.