Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్
వాషింగ్టన్ : ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ శాండర్స్ ఖండించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా రష్యా ప్రచారం చేస్తుందంటూ అమెరికా అధికారులు శాండర్స్‌కు వెల్లడించినట్టుగా వాషింగ్టన్ పోస్ట్ ప్రకటించిన సంగతి తెలి సిందే. దీనిపై శాండర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడిగా ఎవరిని కోరుకుంటున్నారనేది వాస్తవంగా తనకు తెలియదని, అయితే ఈ ఎన్నికలకు పుతిన్ దూరంగా ఉండాలని తాను స్పష్టం చేశానని, పుతిన్ దానిని పాటిస్తారని భావిస్తున్నానని సాండర్స్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యన్లు తమని విభజించడం ద్వారా అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని కోరుకుంటున్నారని, ప్రస్తుత అధ్యక్షుడిలా కాకుండా అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకునే విదేశీ శక్తిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని సాండర్స్ అన్నారు.