Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశోధన సులభతరం : ల్యూక్ జెర్రామ్
లండన్ : బ్రిటన్కు చెందిన గ్లాస్ ఆర్టిస్ట్ ల్యూక్ జెర్రామ్ కరోనా వైరస్ శిల్పాన్ని గాజుతో రూపొందించారు. 9 అంగుళాల ఈ శిల్పం వైరస్ నిర్మాణాన్ని చూపుతోంది. ఇది అసలు వైరస్ కంటే రెండు మిలియన్ రెట్లు పెద్దది. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ జనవరిలో ఈ శిల్పాన్ని రూపొందించడం ప్రారంభించింది. కరోనాకు కారణమయ్యే సార్స్ కొవిడ్-2పై పరిశోధనను వివరించేందుకు ఈ శిల్పం ఉపయోగపడనుంది. కొవిడ్ 19తో పాటు 2004 నుంచి 20కి పైగా సూక్ష్మజీవుల అతిపెద్ద శిల్పాలను జెర్రామ్ రూపొందించారు.