Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరూ మేయర్
లిమా: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే కాక అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా చనిపోయినట్లు నటించాడు పెరూ పట్టణానికి చెందిన ఓ మేయర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు.. కరోనా నేపథ్యంలో పెరూలో లాక్డౌన్ అమల్లో ఉంది. కానీ టంటారా పట్టణ మేయర్ జైమే రొలాండో అర్బినా టొర్రెస్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా సోమవారం రాత్రి తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చి పార్టీ చేసుకున్నారు. అయితే పోలీ సులు రాగానే జైమే రొలాండో ఫేస్మాస్కు ధరించి, కళ్లు మూసి అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న శవపేటికలో పడుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మేయర్ జైమే రొలాండో ఇలా చేశారు. జైమే రోలాండ్ చనిపోయిన వ్యక్తిగా నటిస్తున్నపుడు తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.