Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఒక్కరోజే 50 వేల కోవిడ్-19 కేసులు
- తొెలిసారిగా అత్యధిక కేసుల నమోదు
- ఇప్పటివరకు 1.28లక్షలకుపైనే మరణాలు
న్యూయార్క్: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కోవిడ్..19 కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.అగ్రరాజ్యం తాజాగా కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే సుమారు 50 వేల కేసులునమోదయ్యాయనీ జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.ఒకే రోజు ఇంతభారీస్థాయిలో కేసులు నమోదవ్వడం తొలిసారని పేర్కొంది. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 26లక్షల85వేల806కు చేరింది. వీటిలో ఒకలక్ష28వేల061 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటిఆరు లక్షలకు పైనే కేసులు నమోదయ్యాయి.మృతులసంఖ్యల ఐదులక్షల16వేలకు పైనేదాటింది. అమెరికా తర్వాత అత్యధిక కేసుల జాబితాలో బ్రెజిల్14లక్షల 48వేల753,రష్యా 6లక్షల53వేల479,యూకేలో 3లక్షల14వేల992 లకు చేరాయి.