Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అధికారుల సూచనతో వెనక్కుతగ్గిన అగ్ర రాజ్యాధినేత
న్యూయార్క్ : కరోనా విజంభిస్తున్నప్పటికీ తాను ఎటువంటి మాస్కులు ధరించనని ఇన్నాళ్లు భీష్మించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎట్టకేలకు వెనక్కితగ్గారు. మొదటిసారిగా ఆయన ముఖానికి మాస్కు పెట్టుకున్నారు. వాషింగ్టన్కు సమీపంలో ఉన్న వాల్టర్ మిలటరీ రీడ్ ఆస్పత్రి సందర్శన సందర్బంగా.. ట్రంప్ ముఖానికి అధ్యక్ష ముద్ర ఉన్న మాస్కుతో కనిపించారు. ఇన్నాళ్లు తాను ఎక్కడికి వెళ్లినా మాస్కు పెట్టుకోనని బహిరంగంగానే చెప్పిన అగ్ర రాజ్యాధినేత చివరికి వైద్యులు, అధికారుల సూచనతో మనసు మార్చుకున్నారు. కరోనా వైరస్ బారినపడిన వైద్య సిబ్బంది, స్వచ్చంద సభ్యులను పరామర్శించేందుకు ట్రంప్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లే
స్పందిస్తూ.. 'ఆస్పత్రులకు వెళ్లే సమయంలో మాస్కులు ధరించడం అత్యంత ముఖ్య విషయం' అని అన్నారు. గతంలో అధికారిక సమీక్షలు, విలేకరుల సమావేశాల్లోనూ మాస్కులు ధరించాలని ఆయన్ను కోరినా.. అందుకు ఆయన ఒప్పుకోలేదు. మాస్కు లేకుండానే తిరుగుతానని అన్నారు. ఇందుకనుగుణంగానే ఎన్నికల ర్యాలీలు, ప్రచార సభల్లోనూ ఆయన మాస్కు పెట్టుకోకుండానే హాజరయ్యారు. ఇదే విషయమై ఆయన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్ కూడా పలుసార్లు ట్రంప్‌ను 'ఫూల్' అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల నుంచి విమర్శలు, అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో చివరికి ట్రంప్ కూడా మాస్కు ధరించక తప్పలేదు.