Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరీక్ష సమయం రాగానే చాలా మంది విద్యార్థులు పుస్తకాల తో కుస్తీ పడుతూ ఉంటారు మరికొంత మంది విద్యార్థులు ఇప్పుడే పుస్తకం తీసి చదవడం ప్రారంభిస్తారు అయితే ఎలా చదివినా చాలా వరకు గుర్తుండవు అంటారు మరికొంత మంది విద్యార్థులు.
పుస్తకాలు ఒక్కో విద్యార్థి ఒక్కో విధంగా చదువుతాడు ఎలా చదివినా గుర్తుండడం చాలా ముఖ్యం.
ఈ రోజుల్లో సెల్‌ఫోన్ అందుబాటులో ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా సెల్‌ఫోన్‌పై అతిగా ఆధార పడడం మొదలయింది. ఒకప్పుడు నోటితో లెక్కలు చెప్పెవారు ఇప్పుడు సెల్ఫోన్లో క్క్యాలిక్యులెటర్ ఓపెన్ చేసి చెబుతు న్నారు. ఇలా అతిగా సెల్‌ఫోన్‌పై ఆధారపడడం వల్ల మనం గుర్తుపెట్టుకొనే అవసరం చాలా వరకు తగ్గిపోయింది ఫలితంగా మన మెదడుకు పని చెప్పడం కూడా తగ్గిపొయింది.
ఈ ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులను పరిశీలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకుని పనిచేసే వారే అని ఋజువైంది. కాబట్టి మనం ఎక్కువ విషయాలు గుర్తు పెట్టుకోవడం ఎంతో అవసరం.
మన జ్ఞాపకశక్తిలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. మనం ప్రతీరోజూ అనేక పనులు చేస్తూ ఉంటాం పాటలు వింటాం, సినిమా చూస్తాం, ఇష్టమైన వారితో కబుర్లు చెబుతాం. ఇలా మనం చేసే పనులు అన్నీ కూడా మన మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. మనం చదివిన విషయాలు కూడా మన మెదడులో నిక్షిప్తం అయి ఉంటాయి. ఇలా అన్ని విషయాల సముచ్చయం లో నుండి మనం చదివిన విషయం గుర్తుకు రాదు. ఒక్కోసారి కొంత గుర్తుకు వస్తుంది కొంత రాదు. ఇటీవలి పరిశోధనల ప్రకారం మనం ఉదయం చదివిన విషయం మధ్యాహ్నం వరకు 50శాతం, సాయంత్రం వరకు 20శాతం, మరుసటిరోజుకు కేవలం 10శాతం మాత్రమే గుర్తుంటుంది. కాబట్టి చదివింది గుర్తుకు రాకపోవడం సాధారణ విషయమే...
ఎక్కువ రివిజన్ చేయడం ద్వారా....
మనం ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఎక్కువగా రివిజన్ చేయడం ఎంతో ముఖ్యం. ముందుగానే చెప్పుకున్నట్లు మన మెదడులో అనేక విషయాల సముచ్చయం ఉంటుంది. వాటిలో మనం చదివిన విషయం త్వరగా గుర్తుకు రావాలంటే ఎక్కువగా రివిజన్ చేస్తూ ఉండడం ఎంతో అవసరం.
ఒక ప్రశ్నకు సమాధానం చదివిన తర్వాత రెండో ప్రశ్న మొదలు పెట్టే ముందు తిరిగి మరలా మొదటి ప్రశ్న సమాధానం రివిజన్ చేసిన తర్వాత రెండో ప్రశ్న మొదలు పెట్టాలి. మూడవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టే ముందు తిరిగి మరలా రెండు ప్రశ్నల సమాధానాలు రివిజన్ చేసిన తర్వాత మూడవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టాలి. నాలుగవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టే ముందు తిరిగి మరలా రెండవ ప్రశ్న సమాధానం, మూడవ ప్రశ్న సమాధానం రివిజన్ చేయాలి. నాలుగవ ప్రశ్న సమాధానం మొదలు పెట్టే ముందు తిరిగి మరలా మూడవ ప్రశ్న సమాధానంరివిజన్ చేయాలి. తిరిగి ఆదివారం అన్ని ప్రశ్నలు రివిజన్ చేయాలి.
ఇలా రివిజన్ చేయడం వల్ల మొదటిసారి చదివినప్పుడు ఒక గంట సమయం పడితే రెండవ సారి రివిజన్ చేసినప్పుడు అరగంట, మూడవసారి రివిజన్ చేసినప్పుడు కేవలం పది నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది.
విజువలైజేషన్ ద్వారా....
సాధారణంగా కంప్యూటర్లు మనం అందించిన సమాచారం అంతా బైనరీ కోడ్ రూపంలో నిలువ ఉంచుకుంటుంది. అలాగే మనం చదివిన సమాచారం అంతా మన మెదడులో బొమ్మల రూపంలో నిలువ ఉంటుంది. అందుకే మనం చూసిన సినిమాలు ఎక్కువగా, చూసిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయి. కాబట్టి చదివేటప్పుడు ఎక్కువగా ఊహించుకుంటూ చదవడం ద్వారా ఎక్కువగా గుర్తుంటాయి.
ప్రశ్నించుకుంటూ చదవడం ద్వారా......
ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు? ఎక్కడీ అని ప్రశ్నించుకుంటూ చదవడం ద్వారా మనకు జిజ్ఞాస ఏర్పడుతుంది కనుక మనం చదివిన విషయం కూడా మన మెదడులో ఎక్కువగా గుర్తుంటుంది.
నిమోనిక్స్ ద్వారా....
ఈ పద్ధతి ప్రకారం మీరు చదివిన అధ్యాయంలో నుండి ప్రధాన అంశాలను తీసుకుని వాటితో గుర్తుండిపోయే పదాన్ని లేదా వాక్యాన్ని తయారు చేసుకోవాలి.
ఉదాహరణకు ఇంద్రధనుస్సులో వివిధ రంగులను గుర్తుపెట్టుకోవడానికి VIBGYOR అనే పదం రూపంలో గుర్తుపెట్టుకోవడం. V-Violet, I-Indigo, B-Blue, G-Green, Y-Yellow, O-Orange, R-Red.
అలాగే మరొక ఉదాహరణ ఒక చిన్న వాక్యం ద్వారా సౌర కుటుంబంలోని అన్ని గ్రహలను గుర్తుపెట్టుకోవడం
My Very Educated Mother Just Shouted Us Nine Planets., ఇక్కడ M-Mercury, V-Venus, E-Earth, M-Mars, J-Jupiter, S-Satarn, U-Iranus, N-Neptune and P-Pluto.
ఈవిధంగా మనం యూనిట్‌లోని ముఖ్యమైన భాగాన్ని వాక్యం రూపంలో మార్చి గుర్తు పెట్టుకోవచ్చు.
ఎక్రోనిమ్స్ ద్వారా......
త పదముల సమూహం నుంచి మొదటి అక్షరాన్ని ఉపయోగించి ఒక కొత్త కోడ్ ని రూపోందించె పద్దతినె ఎక్రోనిమ్స్ లేదా అక్షరసంకేతం అంటారు.
ఉదాహరణకు.
ISRO - Indian Space Research Organization
SBI - State Bank of India
NGRI- National Geological Research Institute
ఈవిధంగా ఒక పదం లోని మొదటి అక్షరాన్ని కోడ్ గా ఉపయోగించి గుర్తుంచుకోవడం.
మరొక ఉదాహరణ B H A J S A B అనే కోడ్ మొఘలు వంశ ముఖ్య పాలకులను గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
B- Babar, H- Humayan, A- Akbar, J- Jehangir, S- Shahjahan, A- Aurangazeb, B- Bahadur Shah Zafar.
ఈ విధమైన పద్దతులు ఉపయోగించి చదవడం ద్వారా ఎక్కువగా గుర్తుంటాయి.
- ధర్మారపు జ్ఞానేష్, 8367572018
మానసిక నిపుణులు, తొర్రూరు.