Authorization
Sat April 26, 2025 01:13:53 pm
ఇవిగో నా కంటి నుండి కొన్ని
కన్నీళ్ళు ఇస్తున్నాను
ఇవి నీలో సముద్ర ఘోషను సష్టించగలవు
వాటి విలువ తెలిసిన నాడు
నీలో ఒక ప్రళయం కనిపించవచ్చు
ఒట్టి ఉప్పు నీటిలా చూడకు వాటిని
వాటి వెనుక గడ్డుకట్టుకుపోయిన గాథల్ని చూడు
చరిత్రలో చీకటిలో రాయబడ్డ కథలు కానవస్తాయి
ఆ కథలన్నీ చదువు
ఖచ్చితంగా నీ గుండె కాగలదు మరో సూర్యగోళం
ఆ వ్యధలన్నీ మనసుతో చూడు
నేనిచ్చిన కన్నీటికి మరికొన్ని కలిపి తిరిగి ఇస్తావ్
నే కోరుకునేది అది కాదు
తిరుగుబాటు లా ఉదయించే
మరో సూర్యుణ్ణి చూడాలి నీలో...
- పి.సురేంద్ర, 9346704966