Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లడి కొండల మధ్య పొడిచేటి
ఎర్రటి తొలి పొద్దు అమ్మ
కొవ్వత్తిలా చీకటి తోవలో
కరిగిపోయే వెలుతురు అమ్మ
కష్ట సుఖాల్లో, మంచి చెడుల్లో
గెలుపోటముల్లో తోడుండి
హృదయంలో ఆశల ఊసుల్ని
పెంచుకున్నప్పుడు
అరచేతిలో భూగోలానిన నిలిపి
విజయ పతాకం ఎగురవేస్తూ
గెలుపు సాధించినప్పుడు
అకాశాన్ని గొడుగుగా పట్టేంత
ఆనందహోత్సవ పరవశంతో
అమ్మ కడుపు నిండిపోదా..
ఓటమి ఎదురైనప్పుడు
కన్నీళ్లను తరిమెస్తున్నట్టుగా
ఆ కన్నీటినే కండ్లలో దాచుకుని
తెల్లారే సరికి వాకిట్లో చుక్కల
ముగ్గు అవుతోంది అమ్మ..
అమ్మ లేని బాల్యం మాసిపోతుంది
అమ్మ లేని కౌమారం కరిగిపోతుంది
అమ్మ లేని యవ్వనం గమ్యం లేని
ప్రయత్నంలా మొదలవుతుంది
అమ్మ లేని జీవితం మోడుబారిని వృద్ధాప్యం
నే వేసే ప్రతీ అడుగు అమ్మనే
నే చూసే ప్రతీ చూపు అమ్మనే
ఆకాశమంతా ప్రేమకు
నిదర్శనం అమ్మ
సాక్షాత్తు మా అమ్మ..
- ఆకునమోని రచన