Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజుకోసారి ఐ లవ్ యూ చెప్పమని నేను అడిగిన ప్రతిసారి, నీ నుంచి వచ్చింది ఒకటే సమాధానం. 'ప్రేమంటే పెదవులు పలికే ఐ లవ్యూ శద్ధం కాదు. మనసుకు నచ్చేలా మసులుకోవడం' అదే ప్రేమ అంటావు. 'రోజు షికారులకి వెళ్లితేనో, గిఫ్టులు ఇచ్చుకుంటేనో, ఐ లవ్ యూ చెబితేనే ప్రేమంటార? అయితే అది నా దృష్టిలో నకిలీ ప్రేమే ! అలా అనుకోవడం కూడా నేరమే అంటావు. రోజు ప్రత్యేకంగా కలుసుకోము. కలుసుకోవడమేంటి? అసలు దూరంగా ఉంటేనేగా కలుసుకునేది.
డియర్,
ప్రతి క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. నీ తలపు నాకు తెలియని ఆనందం. నీతో నేరుగా చెప్పలేని ఎన్నో మధురానుభూతులను ఇలా రాస్తున్నా.. ఇది ప్రేమ లేఖ అవునో కాదో నాకు తెలియదు కానీ, ఇదే నా తొలి ప్రేమలేఖ. నవ్వు నన్నూ - నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నా కూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ పడినట్టే వాళ్ళతోనూ గొడవ పడతాను. అసలు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు ? ఎప్పుడూ అడగకు. అందుకంటే దానికి నాదగ్గర సమాధానమే లేదు.
అయినా, అందమైన నీ మోము, హాయిగొలిపే నీ చిరునవ్వు, స్వచ్ఛమైన మనసు ఇంత కంటే నాకు ఇంకేమి కావాలిచెప్పు? నీలో నన్ను ఇట్టే కట్టిపడే మరోవిషయం కూడా ఉంది? అదేంటో తెలుసా డియర్? నీ మనోధైర్యం. నా ప్రశ్నలన్నిటికి నువ్వే సమాధానం. నిత్యం సమస్యలతో సతమతం అవుతున్న నన్ను- నేనుగా తీర్చుకునేల చేసేది నువ్వే కదా! నన్ను ఆనందంగా భరిస్తావు. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటావు. అమ్మలా ప్రేమను పంచుతావు. నాన్నలా వెన్నంటి నిలుస్తావు. ఇవి చాలదా నిన్ను ప్రేమించడానికి. అవును, ఇవే నా ప్రేమకి అర్హతలు. నేనే కాదు - నువ్వు కుడా నన్ను నాలాగే ప్రేమిస్తునావు. నాకంటే ఎక్కువే ప్రేమిస్తునావు అనుకో.
నాకింకా గుర్తుంది. నా ఎడుపుతో నిన్ను ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టాను. అయినా నన్ను నన్నుగానే భరించావు తప్ప. నన్ను వదిలించుకునే ప్రయత్నం చేయలేదు. నేను ఎప్పుడయినా ఎలాగైనా నీతో ఉండొచ్చు. ఏ క్షణమైనా నిన్ను విసిగించేయోచ్చు. ఎందుకంటే మన ప్రేమకి ఏ హద్దులు లేవుగా ! నా సుఖాలనే కాదు నా కష్టాలను కుడా స్వీకరిస్తావు. రోజుకోసారి i love you చెప్పమని నేను అడిగిన ప్రతిసారి, నీ నుంచి వచ్చింది ఒకటే సమాధానం. 'ప్రేమంటే పెదవులు పలికే i love you శద్ధం కాదు. మనసుకు నచ్చేలా మసులు కోవడం' అదే ప్రేమ అంటావు. 'రోజు షికారులకి వెళ్లితేనో, గిఫ్టులు ఇచ్చుకుంటేనో, ఐ లవ్ యూ చెబితేనే ప్రేమంటార? అయితే అది నా దృష్టిలో నకిలీ ప్రేమే ! అలా అనుకోవడం కూడా నేరమే అంటావు. రోజు ప్రత్యేకంగా కలుసుకోము. కలుసుకోవడమేంటి? అసలు దూరంగా ఉంటేనేగా కలుసుకునేది.
ఇదిగో ఇంత స్పష్టత నీకుంది కాబట్టే, నన్ను నీలా మార్చుకుంటు న్నావు. అందుకే మనలా ఎవ్వరు ఉండలేరు. అన్నట్టు చెప్పడం మరిచిపోయా, అప్పుడప్పుడూ నేనే అలిగేది నీ చేతి ముద్దలు తినడానికే అన్న నిజంగా నీకు తెలియదుగా. . .