Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేరుకుపోయిన జీవితాలలో
వెలుగునింపని వాళ్ళు
పెట్టుబడిదారుల కబంధ హస్తాలలో
కార్మికుల శ్రమతో పబ్బం గడుపుతూ
దినసరి వేతనరాయితీలతో కోత విధిస్తూ
శ్రమ దోపిడీ అరికట్టలేని పాలకుల చేతిలో
బందీలు అవుతూ
అన్నం పెట్టే రైతు నుంచి
కుడు గుడ్డాలేని కార్మికుల వెట్టి చాకిరి
దారిద్రాన్ని అలమటిస్తూ
రేయనక పగలనక
కష్టపడి గొడ్డుసాకిరి చేస్తూ
పేదరికం అవిచ్ఛిన్నంతో
ఆర్థిక అసమానతలు లేని
ఎన్నో కార్మికుల జీవితాలు
సతమతమవుతున్నాయి
ఆదాయ వ్యాయాలలో
మార్పు లేనంత కాలం
కష్టించే శ్రమపడిన
కార్మికుల సొమ్మును దోచుకునే
శ్రమ నిర్వీర్యం అవుతుంది
అగాధాలలో చిక్కుకున్న
అప్పుల ఊబితో
విష నగమైన చెల్లుబాటు కానీ
అగోచార వేదన వెక్కిరిస్తుంది
శ్రమ బానిసత్వం ముడిపడి ఉన్న
కడు పేదల కార్మికుల
విలసిల్లిన జీవితం ఒకటి
కాటుకి దగ్గరలో
శ్రమను దోచుకున్న తరుణంలో
పెట్టుబడిదారుల హృదయాల్లో
కార్మికుల మరణాలు
వారి జీవనానికి అస్త్రాలు
కనీస పనికీ
కనీస వేతనాలు అమలు లేని
కార్మికులందరినీ ఐక్యం చేస్తూ
ఉద్యమానికి సంసిద్ధమవుతూ
కార్మికుల ఐక్యత మేడే
ప్రణమిల్లాలి
ఎర్రనిక్రాంతి వెలుగులు వర్ధిల్లాలి
- బూర్గు గోపికృష్ణ, 7995892410