Authorization
Mon Jan 19, 2015 06:51 pm
95 ఏండ్లుగా క్రమం తప్పకుండా ఆస్కార్ అకాడమీ ఇస్తున్న ఆస్కార్ అవార్డు అందుకున్న వారు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రెటీలై పోతున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో అతి కొద్ది మందికే దక్కుతాయి. అయితే ఈ అవార్డులు రానివారికి కూడ ఆస్కార్ అవార్డుల కమిటీ ఇచ్చే కిట్ గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.
ఆస్కార్‌కు నామినేట్ అయిన వ్యక్తులు అందరికీ లక్షా26వేల డాలర్స్ అంటే దాదాపు కోటి మూడు లక్షల రూపాయలు విలువైన ఆస్కార్ కిట్ బ్యాగ్ ఇస్తారు. అందులో జపనీస్ మిల్క్ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ కూడ ఉంటుందట. ఈ రెండు మినహా మిగతావి అవేవి తినే వస్తువులు కాదు.
ఇటలీకి చెందిన ఓ ప్రయివేట్ లైట్‌హౌజ్‌లో 8 మందితో కలిసి 3రోజులు గడిపేందుకు వీలుగా కొన్ని గిఫ్ట్ కూపన్స్ కూడ ఇందులో పెడతారు. అత్యంత విలాస వంతమైన ఈ లైట్‌హౌస్‌లో కేవలం సెలెబ్రెటీ లకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీనితోపాటు కెనడాలోని 10 ఎకరాల సువిశాలమైన ఎస్టేట్ లో స్టే చేసే అవకాశం కూడా కల్పిస్తారట. రోజుకు 40వేల డాలర్ల ఖరీదు చేసే ఈ ఎస్టేట్ లో బాగా అత్యంత ధనవంతులు మాత్రమే హాలిడే ట్రిప్ ను ఎంజారు చేస్తూ ఉంటారు.
వీటితో పాటు ఆస్ట్రేలియా లోని ఒక ప్రముఖ నగరంలో అత్యంత ఖరీదైన ఒక ఫ్లాట్‌ను గిఫ్ట్ గా ఇస్తారు. దీనితోపాటు ఈ ఈవెంట్ కు డెలిగేట్ గా వచ్చిన వారందరికీ కాస్మొటిక్ సర్జరీ కోసం 41వేల డాలర్లు యిస్తారు. ఇలా దాదాపు 60 బహుమతులతో కూడిన ఈ కిట్ కోటి రూపాయల విలువ ఉంటుందని అంచనా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ కిట్ బ్యాగ్ ఆస్కార్ అవార్డులు వచ్చిన వారికి ఇవ్వరు. ఆస్కార్ అవార్డులు రానివారికి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఈవిషయానికి సంబంధించి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఆస్కార్ కిట్ అవార్డుల వార్తలు అందరికీ బాగా ఆశక్తిని కలిగిస్తున్నాయి.