Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ వ్యాపారంలోనైనా ఆ వ్యాపారానికి సంబంధించిన సాంప్రదాయ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే వారు మంచి వ్యాపారవేత్త కాలేరు. ఢిల్లీకి చెందిన తాప్సీ అనే యువతి, ఢిల్లీ ప్రజలు అమితంగా ఇష్టపడే ప్రమాదకరమైన స్ట్రీట్ ఫుడ్ కు ''సమస్య'' మూలాన్ని కనుగొంది. అంతే కాదు వారి అభిరుచికి తగ్గట్టుగా రుచికరమైన,ఆరోగ్యకరమైన పానీపూరి అందించాలని నిశ్చయించుకుంది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో నివసిస్తున్న 80.7 శాతం మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. వీధి ఆహారాన్ని తయారుచేసే అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా వందలాది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వారి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. అలా పట్టించుకునే వారే లేరు. ఇవి ఆ ప్రాంతంలోనే ఉండే తాప్సీ ఉపాధ్యాయ కంట పడే నిత్యదృశ్యాలు. దీనికి తనకు చేతనైన పరిష్కారాన్ని చూపించాలని అనుకుంది.
బిటెక్ పూర్తిచేసిన వెంటనే తను రంగంలోకి దిగింది. ఢిల్లీ ప్రజలకు ఆరోగ్యకరమైన ఇంకా రుచికరమైన ఆహారాన్ని అందించడమే నా లక్ష్యం అంటూ ప్రకటించింది. ఆరోగ్యకరమైన వీధి వంటకాలను అందించాలని బావించింది. అందుకు తను కూడా బాగా ఇష్టపడే పానీపూరిని ఎంచుకుంది.
'ఆర్ యు హంగ్రీ - ఇన్స్టాగ్రామ్ పేజీలో తాప్సీ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న ప్రముఖ వీడియోను షేర్ చేసింది. ఆమె ఇంట్లో తయారుచేసిన మసాలా నీరు, ఇమ్లీ, ఖజూర్, బెల్లం చట్నీతో పాటు, గాలిలో వేయించిన పానీ పూరీని వీడియోలో షేర్ చేసింది. ఆ వీడియోకు మూడు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై పెద్ద సంఖ్యలో ప్రజలు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఢిల్లీలోని తిలక్ నగర్‌లోని ఈ యువ వ్యాపారవేత్త 'బీటెక్ పానీ పూరీ వాలీ - అనే పేరుతో పానీ పూరీ దుకాణాన్ని నడుపుతోంది. బైక్, ప్రత్యేకమైన సెటప్‌తో కొత్తదనంతో పానీపూరి లవర్స్ ను ఆకట్టుకుంటుంది. చాలా ఆర్యోగకరంగానే కాక, రుచికరంగా కూడా ఉన్నాయని ప్రశంసలందుకుంటుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత, వీధి ఆహారాన్ని విక్రయించాలనే ఆమె నిర్ణయాన్ని మొదట చాలా మంది వ్యతరేకించారు. అలాంటి వారే నేడు ఆమె వ్యాపారాన్ని నడుపుతున్న తీరును చూసి యూత్ రోల్ మోడల్ గా కీర్తిస్తున్నారు.
తాజాగా ఆమె ఈ ఏడాది 'బీటెక్ పానీ పూరీ వాలీ - అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది. దానిలో ఆమె తన లాగా ఆలోచించే అనేక మంది యువ పారిశ్రామికవేత్తలకు మెళుకువలు తెలుపుతోంది. దేశ వ్యాప్తంగా తన వ్యాపారిన్ని విస్తరించే ఆలోచనలో ఉంది. ఈ నెల 17న గుజరాత్ లో తన బ్రాంచ్ ప్రారంభిస్తుంది.