Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హృదయమా ఆగిపోకు అప్పుడే
ఏదీ సాధించలేదింకా ఇప్పుడే
అనుభవించిందీ లేదు
ఎదురించిందీ లేదు
ఆనందించిందీ లేదు
ఆస్వాదించిందీ లేదు
హృదయమా ఆగిపోకు అప్పుడే
గుడ్డి దీపమా ఆరిపోకు ఇప్పుడే
వేచి చూసిందీ లేదు
నెరవేర్చిందీ లేదు
కోర్కె కోరిందీ లేదు
ఆశ తీరిందీ లేదు
హృదయమా ఆగిపోకు అప్పుడే
ఎరిగింది లేదు ఇప్పుడే
కలలు కన్నదీ లేదు
కోరింది కొన్నదీ లేదు
పంతం పట్టిందీ లేదు
సొంతం అయ్యిందీ లేదు
హృదయమా ఆగిపోకు అప్పుడే
సాధించ లేదింకా ఇప్పుడే
అందిందీ లేదు
పొందిందీ లేదు
దక్కిందీ లేదు
చేతికి చిక్కిందీ లేదు
హృదయమా ఆగిపోకు అప్పుడే
చావాలని లేదు ఇప్పుడే.
- ఇనుగుర్తి సాయికీర్తి