Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మట్టి కుండలాంటిదిరా మనసు
ఆరిపోయే దీపమురా వయసు..
నిండుకుండ కోసమేరా అన్వేషి.
నిండుకుంటే పోయేనురా ఈ మనిషి.
కూడలి కడలి మధ్య సాగేరా జీవితం
కాటికి చేరే వరకు ఆగదురా పయనం
కన్నుమిన్ను కానరాని కుటిల కఠిన లోకంలో
కన్నుమూసి తెరిసేలోపు మాయంరా ఈ క్షణం..
నన్ను నేను వెతుక్కుంటూ సాగిపోతున్నా...
సర్వసిద్ధికై సాహసిస్తున్నా..
నడిచే దారిలో నేలకొరిగితే మైలురాయి నేనౌతా.
గమ్యం చేరితే పరుల గమనాన్నౌతా...
- సామల ఫణి కుమార్
9989735040