Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును.. మా అమ్మ అందరిలా కాదు
అడుగులు వేసే సమయంలో
నా కోసం తను మొదటడుగు వేసింది ఆ ఎదురు బాటలో
ముళ్ళ బాటుందో, పూల బాటుందో ఆలోచించలేదు.
తన ఆనందాన్ని వెతుకుకొని ఏ సి రూంలో ఉండలేదు
నా కోసం ఆ ఎర్రటి పండు కింద
చెమటను ఆస్వాదిస్తూ ప్రేమానురాగాలతో పెంచింది
మా అమ్మ అందరిలా కాదు...
అందరిలా మా అమ్మ పట్టణాలలో చదివించలేదు.
సర్కారు బడి ఐన ఈ పల్లెటూళ్ళలో పుట్టిన పిల్లలే
పట్టణాలు అని గుర్తుచేసేలా ఎదగమంది
వర్ణమాలలోని మొదటి అక్షరంగా మారి
పసి వయసులోనే మొదటి గురువు తానైంది
అవును మా అమ్మ అందరి అమ్మలా కాదు...
తన గురించీ ఎంత రాయాలి అనుకున్నా
కలానికి పదాలు సరిపోవేమో
తన ప్రేమ ముందు కలం, కాలం మూగబోతు
తన కాళ్ళ దగ్గర మొకరిల్లుతుంది
అవును మా అమ్మ అందరిలా కాదు...
ఎంతైనా అమ్మ అమ్మే..
- ఎమ్. మమత