Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే... రోజూ పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం తప్పనిసరి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు. ఫాస్ట్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. వ్యాయామం చేయడాన్ని కూడా అంత సీరియస్‌గా తీసుకోరు. దీని కారణంగా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే మన శరీరం, గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో అసలు మనం ఆరోగ్యంగా ఎందుకుండాలి? మన గుండె ఆరోగ్యంగా ఉండడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకొందాం.
- జీవితకాలం పెరుగుతుంది.
- వయసు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
- జీవనశైలి మారడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు మన దరికి రావు.
- ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండవచ్చు.
- మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
- ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండగలుగుతాం.
- హెల్తీగా, ఫిట్‌గా ఉండటం వల్ల మలివయసులో సైతం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.