Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అకస్మాత్తుగా బరువు పెరగటం, తగ్గటం, నెలసరి సమస్యలు, థైరాయిడ్, అలసట వంటి శారీరక మార్పులకు హార్మోన్ల అసమతుల్యత కారణం కావొచ్చు. దీన్నెలా అధిగమించాలంటే...
యుక్త వయసులో మొటిమలు, నెలసరిలో ఎక్కవ రక్తస్రావానికి ఈ హార్మోన్ల అసమతుల్యతే కారణం. ఈ వయసులో జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ బరువును అదుపులో ఉంచుకుంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు.
గర్భం దాల్చినప్పుడు హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయి. బిడ్డ ఎదుగుదలకు ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువగా అవసరం అవుతాయి. పోషకాహారం తీసుకోవటంతో పాటు క్రమం తప్పక వ్యాయామం చేస్తే హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచొచ్చు.
రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుకోవాలి. ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు ఉండే చేపలు, మాంసం, గుడ్లు, డ్రైఫ్రూట్స్, పాలకూర, మొలకలు వంటివి తీసుకోవాలి.
రోజుకు 7, 8 గంటలు గాఢ నిద్రపోవాలి. అప్పుడే హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది.