Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాధారణంగా పిరియడ్స్ 28 రోజులకే అవుతుంది. ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. శరీర తీరును బట్టి మార్పులుంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కొంతమందిలో అధిక రక్తస్రావం, ఒళ్లునొప్పులు అధికంగా ఉంటాయి. వీటిని సహజంగా అదుపులో పెట్టొచ్చంటున్నారు నిపుణులు..
- నొప్పులను తగ్గించేందుకు హాట్ప్యాక్లను వినియోగిస్తూంటాం. హాట్ప్యాక్ను పొత్తి కడుపుపై 20 నిమిషాల పాటు జరుపుతూ మర్దనా చెయ్యాలి. బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే రోజులో ఇలా 2, 3 సార్లు చేస్తే తగ్గుతుంది.
- శరీరంలో ఐరన్ తగ్గితే కూడా అధిక రక్తస్రావం అవుతుందని అధ్యయనాల్లో తేలింది. నెలసరిలో వైద్యుల సలహాతో ఐరన్ మాత్రలను తీసుకోవచ్చు. దాంతో కొంత వరకూ బ్లీడింగ్‌ను అదుపులో ఉంచొచ్చు.
- ఓ కప్పు నీళల్లో ఓ అంగుళం ముక్క దాల్చిన చెక్కను వేసి కాచుకొని తాగాలి. ఒళ్లు నొప్పులను అదుపులో ఉంచడమే కాక బ్లీడింగ్‌ని కూడా తగ్గిస్తుంది. ఆ సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్లనూ నిరోధిస్తుంది.
- విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. అవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇనుముకు గ్రాహకాలుగా పని చేస్తాయి. తగినన్ని నీళ్లు తాగాలి. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ, విశ్రాంతి తీసుకోవాలి.