Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెనోపాజ్ వయసులో కొన్ని సమస్యలు సర్వసాధారణం. అయితే నిద్రలో చెమటలు పట్టడమనేది తరచూ తలెత్తినా, దీంతో అసౌకర్యంగా అనిపించినా ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించాలి. తద్వారా సమస్యేంటో తెలుసుకొని.. చికిత్స తీసుకోవాలి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
- మెనోపాజ్‌కు దగ్గరవుతున్న, మెనోపాజ్‌లో దశలో ఉన్న మహిళలు ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో మసాలా, కారం.. వంటివి దూరం పెట్టాలి.
- బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నిపుణుల సలహా మేరకు పోషకాహారం తీసుకుంటూనే.. వ్యాయామాలు చేయడం ముఖ్యం.
- కెఫీన్, మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చాక్లెట్.. వంటి వాటిని ఎంత దూరం పెడితే అంత మంచిది.
- నిద్రించే ప్రదేశం చల్లగా ఉండేలా చూసుకోవాలి. అలాగే చల్లదనాన్ని పంచే పరుపులు, దిండ్లకు ప్రాధాన్యమివ్వడం ముఖ్యం.
- కొన్ని రకాల మందుల వల్ల ఈ సమస్య ఎదురవుతోందని గమనిస్తే వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర మందులేవైనా వాడచ్చేమో నిపుణుల్ని అడిగి సలహా తీసుకోవడం మంచిది.
- మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకునేందుకు నచ్చిన పనులు చేయడం, ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది.