Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో బంధాలు, బంధుత్వాల మధ్యే చిన్న చిన్న తగాదాలు సహజం. అలాగే ఆఫీసులో కూడా కొన్ని గొడవలు ఉంటూనే ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా కలిసి ఒకే తాటి మీద నడవాలంటే కష్టమే. భిన్న మనస్తత్వాలు, పని తీరు ఉంటాయి. అలాంటివి అర్థం చేసుకొని సర్దుకుపోతే జీవితంలో ఎక్కడైనా నెగ్గొచ్చంటున్నారు నిపుణులు..
- మీరు చేసిన పనికి ఇతరులు ఫలితం తీసుకుంటే చాలా కోపమొస్తుంది. అలాంటి సమయంలో ఆవేశపడితే లాభం లేదు. అందుకని ఎప్పుడు చేసిన పనిని అప్పుడు ఫైల్ చేసి పెట్టుకోవాలి. నిరూపించాలను కున్నప్పుడు ఆధారాలు చూపిస్తే సరి.
- ఇతరుల గురించి ఆఫీసులో గాసిప్స్ చాలా వింటాం. ఎవరెవరి గురించో మాట్లాడుకున్నవన్నీ విని పట్టించుకోవద్దు. ఎక్కడ విన్నవి అక్కడే మర్చిపోవాలి.
- ఇతరులకు మనకంటే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని అసూయ పడటం తప్పు. కృషి ఎక్కువగా చేస్తే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇంత చిన్న విషయానికి ఎదుటి వారు ఎదిగిపోతున్నారని ఈర్ష్య చెందటం మంచిది కాదు.
- సహోద్యోగులతో పక్షపాత ధోరణితో కాకుండా స్నేహభావంతో మెలగాలి. ఈ సానుకూల అంశాలన్నీ ఎదగడంలో దోహదపడతాయి. కెరియర్లోనైనా, జీవితంలోనైనా చెడును వదిలేసి మంచిని తీసుకుంటే ముందడుగు వేయగలం.