Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోరు వెచ్చటి నీటిని ధారగా ఎత్తి నొప్పి ఉన్నచోట పోయాలి. కాళ్లను కొబ్బరి నూనెతో, వంట నూనెతో గాని మర్దనా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
- కాళ్ల కండరాలకు వారానికి రెండు సార్లు కోల్డ్ ప్యాక్ వేసుకుంటే రిలాక్స్ అవుతాయి.
- వ్యాయామం, యోగ అలవాటు చేసుకోడం వల్ల శరీరంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి కాళ్లు తేలికబడతాయి.
- వ్యాయామం చేస్తున్నప్పడు కాళ్లు నొప్పిగా అనిపిస్తే చెయ్యడం ఆపేయండి. అదే పనిగా చేస్తే కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది.
- వాకింగ్ చెయ్యడం, నిద్రపోవడం, లేవడం ప్రతిరోజూ ఒకే సమయంలో చెయ్యాలి.
- రోజుకి కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి.
- తాగే కాఫీ, టీలలో ఎక్కువ డికాషన్ ఉండకుండా చూసుకోవాలి.
- ఎలా బడితే అలా లేవకూడదు. అలా లేస్తే కండరాల నొప్పులొస్తాయి.
- అలసిపోయిన కాళ్లను మందులతో తగ్గించే ప్రయత్నం చెయ్యకుండా కాస్త విశ్రాంతి ఇస్తే త్వరగా ఉపశమనం ఇచ్చేవీలుంది. నొప్పి ఎక్కువగా వస్తుంటే వెంటనే డాక్టరుదగ్గరకు వెళ్లడం మంచిది.