Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంచున్న పొడుగు పట్టు లెహంగాలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత మిడ్డిలు, స్కర్ట్స్ రాకతో అవి కాస్త వెనక బడ్డాయి. ఓణీలు వేసినప్పుడు మాత్రమే పట్టులెహంగాలు వేసుకునేవారు. అయితే ఈ మద్య ట్రెండ్ మారింది. వెరైటీ లెహంగాలు సైడ్‌కి చున్నీలతో... చిన్నా, పెద్దా కూడా వేస్తున్నారు. ఇప్పుడు మన పట్టు లెహంగాలు మళ్ళీ అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి. అయితే కాస్త వెరైటీగా.. జరి, పట్టు లేసులు, గోట్ డిజైన్ల అంచు లతో పట్టు నుంచి జార్జెట్, కాటన్, క్రేప్ లాంటి రకరకాల మెటీరియల్స్‌తో చూడగానే ఆహా అనిపించేలా ఉంటున్నాయి. పైన అంతా సాదాగా వుంటుంది. పాదాల పైకి లాంగ్ స్కర్ట్ పొడువుతో వుండే ఈ లెహం గాలకు కింద అర చేతి మందాన బోర్డర్ వుంటుంది. ఆ బోర్డర్‌కి సరిపోయేలా జాకెట్టుని డిజైన్ చేస్తున్నారు. లాంగ్ స్లీవ్స్‌తో చూడటానికి భలే వుంటాయి. అటు ఓల్డ్ ఫ్యాషన్, ఇటు న్యూ లుక్... మీరు ట్రై చేయండి... మీ టేస్ట్‌కి తగ్గట్టు డిజైన్ చేయించుకోండి.