Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యకరమైన పనితీరు కోసం మీరు శరీరానికి ఆహారం అందించినట్లే, మీ చర్మం కోసం కూడా అదే చేయవలసి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇకవేళ తక్కువగా ఉంటే బెర్రీలు, గింజలు, తక్కువ ప్రోటీన్లు, ఆకుకూరలతో భర్తీ చేయవచ్చు.
- చర్మ సంరక్షణ నియమావళి పాటించడానికి ఎక్కువ సమయం తీసుకోకండి. మీరు యవ్వనంలోకి అడు గిడినప్పటినుండే చర్మాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజ్ చేయడం, జాగ్రత్త వహించడం మొదలుపెట్టండి.
- వ్యాయామం మీ శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా అద్భుతాలు చేస్తుంది. మీ గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ జరిగి, తద్వారా టాక్సిన్స్ (వ్యాధి క్రిములు పుట్టించు విషము) విసర్జన జరిగేందుకు సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత మీ ముఖం ప్రకాశవంతంగా మారడానికి కారణం ఇదే.
- ఆలస్యంగా నిద్ర పోవడం దీర్ఘ కాలంలో దుష్ప్రయోజనాలు కలిగిస్తుంది. నిద్ర లేమి మీ ముఖం మీద రక్త నాళాలను బిగుతుగా చేస్తుంది. నిద్ర వాస్తవానికి చర్మానికి అత్యంత అవసరమయిన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అందుకే... త్వరగా నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయండి.
- మీరు రోజువారీ మేకప్పు ఉపయోగించే వారయితే చర్మ సంరక్షణ కోసం ఒక రోజు పక్కన పెట్టండి. మీ చర్మం ఒక స్పాంజ్ వలె ఉంటుంది. మీరు ఉపయోగించిన ఉత్పత్తులు ప్రతి పొరను వేగంగా గ్రహిస్తుంది. కాబట్టి, మీరు మీ చర్మానికి మేకప్ వేయకుండా విశ్రాంతి ఇస్తే చర్మ రంధ్రాలను, కణాలను ఫ్రీ చేస్తుంది.