Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుందన్స్, స్టోన్స్, వీటన్నింటినీ డామినేట్ చేసే పల్లూ, స్వచ్ఛమైన జరీతో మెరిసిపోయే చీరలు ప్రస్తుతం అమి తంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో, అపురూపమైన డిజైన్లతో ఉన్న ఈ చీరలు మహిళలను అల్లుకుపోయి మరింత అందంగా కనిపిస్తున్నాయి. డిజైనర్ చీరలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈనాటి అమ్మాయిలు వీటిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఫంక్షన్లకు, వివాహ కార్యక్రమాలకు పట్టుచీరలకంటే ఇప్పుడు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే డిజైనర్ చీరలంటే ధరలు మాత్రం మాములుగా ఉండవు. త్వరలో బతుకమ్మ రాబోతుంది. మన పెద్ద పండుగ ఇదే. అందుకే చిన్నపాటి జాగ్రత్తలు, కాస్తంత సజన జోడిస్తే మీ దగ్గ రుండే సాదా చీరలనే అందంగా తయారు చేసు కుని డిజైనర్ శారీలను తలదన్నేలా తీర్చి దిద్దవచ్చు. బతుకమ్మల్లో బతుకమ్మలా మెరిసిపోవచ్చు.