Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టూత్‌పేస్ట్ వలన దంతాలు మాత్రం శుభ్రం చేసుకోవచ్చని చాలామందికి అనుకుంటున్నారు. వాస్తవానికి టూత్‌పేస్ట్ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని సరిగ్గా ఉపయోగించుకోవాలే గానీ టూత్‌పేస్ట్ చాలా పనులకు ఉపయోగపడుతుంది. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం..
- చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా ఉంటాయి. వాటిని తొలగించాలంటే.. టూత్‌పేస్ట్‌ను మొటిమలు రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొటిమల సమస్య పోతుంది.
- స్మార్ట్‌ఫోన్ తెరలను శుభ్రం చేసేందుకు టూత్‌పేస్ట్‌ను వాడొచ్చు. ఎలాగంటే.. కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకుని ఫోన్ స్క్రీన్‌పై రాయాలి. ఆపై మెత్తని వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే ఫోన్ స్క్రీన్ మెరుస్తుంది. స్క్రాచ్‌లు ఉన్నా కనిపించవు.
- కాలిన గాయాలు, పురుగు కుట్టిన ప్రాంతంల్లో పేస్ట్‌ను రాసుకుంటే నొప్పి, మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
- అద్దాలు మసకగా కనిపిస్తున్నాయా.. అయితే టూత్‌పేస్ట్‌ను వాటిపై రాసి గుడ్డతో శుభ్రం చేయండి.. ఫలితం ఉంటుంది.
- వెండి, ఇత్తడి వస్తువులు పాతగా కనిపిస్తుంటే వాటిపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాసి వెంటనే నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పాతవి కూడా కొత్తగా మెరుస్తాయి.
- దుస్తులపై పడే మరకలను తొలగించాలంటే టూత్‌పేస్ట్‌ను ఆ మరకలపై కొద్ది కొద్దిగా రాయాలి. ఇలా చేయడం వలన మరకలు తొలగిపోతాయి.