Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలో కొవ్వు పేరుకుపోయి రకరకాల సమస్యలతో సతమతమవుతుంటారు చాలామంది. ఈ కొవ్వు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకనే ఈ కింది చిట్కాలు పాటిస్తే కొవ్వును కరిగించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
- రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో బాగా కలిపి దీన్ని ఉదయం పరగడుపునే తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
- ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొవ్వు కరుగుతుంది.
- రెండు టేబుల్ స్పూన్ల క్రాన్బెర్రీ జ్యూస్‌ను ఒక గ్లాస్ నీటిలో కలిపి దీన్ని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
- గోరువెచ్చగా ఉండే ఒక గ్లాస్ నీటిలో అవిసె గింజెల పొడి ఒక టీస్పూన్, తేనె ఒక టీస్పూన్ కలిపి ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగాలి. ఇది కూడా పొట్ట దగ్గర కొవ్వును బాగా తగ్గిస్తుంది.
- గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలో నువ్వుల నూనె ఒక టీస్పూన్, అల్లం రసం ఒక టీస్పూన్ మోతాదులో కలిపి రోజుకు రెండుసార్లు దీన్ని తీసుకోవాలి. ఇది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది.
- గ్రీన్ టీ పొడి ఒక టేబుల్ స్పూన్, నిమ్మరసం పావు టీస్పూన్, తేనె రెండు టీస్పూన్లు తీసుకుని వీటిని ఒక గ్లాస్ నీటిలో కలపాలి. మూడు నిమిషాల పాటు ఇలా చేయాలి. దీన్ని రోజుకి రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.