Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలికాలంలో నీరు తాగడం ఎంతో అవసరం. ఈ కాలంలో దాహంగా అనిపించదు కాబట్టి నీరు తాగడం మర్చిపోతాం. ఒక బాటిల్ దగ్గర పెట్టుకుని అందులో నుండి మాత్రమే నీరు తాగితే మీకే తెలుస్తుంది, ఎంత తక్కువ నీరు తాగుతున్నారో. అందుకనే, మీ మొబైల్ ఫోన్లో రిమైండర్ పెట్టుకుని అయినా నీరు తాగండి. లేదా ఒక ఆట లా కూడా దీన్ని మార్చుకోవచ్చు. మీరు టైమ్ చూసినప్పుడల్లా చివరి సంఖ్య బేసి సంఖ్య అయితే గ్లాసు నీరు తాగాలి అని అనుకుని తాగండి. తేడా మీకే తెలుస్తుంది.
- దోసకాయలు వంటి వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంపలు, క్యారెట్స్, క్యాప్సికం, గుమ్మడికాయ వంటి వాంటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్స్ ఏ, బీ, ఈ, ఐరన్, ఒమేగా-3 కొరకు పాల కూర, ఇంకా ఇతర ఆకు కూరలు తీసుకోండి.
- మీ చేతులు మెత్తగా మదువుగా లేవంటే మీకు ఒమేగా 3 సరిపడినంత లేదని కూడా సూచన కావచ్చు. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్ లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.
- ఈ కాలంలో వేడి నీటి స్నానం వల్ల హాయిగా ఉంటుంది. కానీ మరీ ఎక్కువ వేడి నీరు చర్మానికి మాత్రం హాని చేస్తుంది. అందుకే గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి.
- కొబ్బరి నూనె చర్మ రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్‌ని తగ్గిస్తుంది.