Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. కేలరీలను, కొవ్వును తగ్గిస్తుంది.
- అలోవెరా జ్యూస్ తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మ రసం కలపాలి. ఎక్సర్సైజ్ చెయ్యడానికి వెళ్లేముందుగానీ, లేదా వర్కవుట్ పూర్తైన తర్వాత గానీ ఈ జ్యూస్ తాగాలి. రోజూ ఇలా చేస్తే, మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు మీకు అనిపిస్తుంది. జిమ్‌లో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మీ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది.
- ఫ్రెష్‌గా ఉన్న అలోవెరా ఆకు తీసుకొని దాన్ని కత్తితో కోసి అందులో గుజ్జును వేరు చెయ్యాలి. మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్‌ని ఓ గ్లాస్ తీసుకోవాలి. అందులో ఓ టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్‌ను కలపాలి. అది తాగేస్తే శరీరంలో చెడు వ్యర్థాలన్నీ పరారవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతాం.
- లేత పాలకూర ఆకులు కొన్ని తీసుకోవాలి. వాటిలో ఓ కప్పు అలోవెరా జ్యూస్ కలపాలి. పావు కప్పు నీరు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వేసి... మిక్సీలో బ్లెండింగ్ చెయ్యాలి. అది చక్కటి గుజ్జులా, జ్యూస్‌లా మారుతుంది. జిమ్‌కి వెళ్లేముందు ఇది తాగేస్తే ఎనర్జీతో వర్కవుట్ చెయ్యవచ్చు. దీని వల్ల పాలకూరలో పోషకాలు కూడా మీకు లభిస్తాయి.