Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విటమిన్లు, ఖనిజాలతో నిండిన పండు రేగు పండు. ఇది రక్త ప్రవాహం, శరీర హార్మోన్లు, జుట్టు, ఎముకలు, చర్మం, కండరాలు, శరీర ఎంజైములు ఏర్పడటానికి సహాయపడుతుంది. అలాంటి రేగు పండ్లలో వున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం...
- శరీరానికి చక్కటి పోషకాలు కావాలంటే రేగు పండ్లను తినాల్సిందే. చిన్న రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి.
- ఇందులో వుండే మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. రక్త హీనత సమస్య నుంచీ రేగు పండ్లు కాపాడతాయి. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు తీసుకోవాలి.
- ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా వుండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినాలి.
- కీళ్ల వాపులు, నొప్పులూ ఉన్నవారు ఈ పండ్లు తింటే వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని తగ్గిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.