Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనలో చాలామంది ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తూ చిరుతిండిని అధికంగా తీసుకోవడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలనూ చూస్తున్నారు. దాంతో చాలామందికి బరువు పెరగడమనేది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆలస్యం కాకమునుపే మనం కచ్చితంగా ఆప్రమప్తతతో వ్యవహరించి మన రోజువారీ ఆహార అలవాట్లలో కొద్ది పాటి మార్పులను చేసుకోవాల్సి ఉంది.
అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదంలు వంటివి తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా భోజనానికి, భోజనానికి నడుమ వీటిని ఇతర స్వీట్లు లేదంటే చిరుతిళ్లకు బదులుగా తీసుకోవడం మంచిది. బాదంలు తీసుకోవడం వల్ల కడుపు నిండిందన్న భావన కలుగుతుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములను తీసుకోవడం వల్ల అనాలోచితంగా అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలన్న కోరికను అధికమించడంతో పాటుగా బరువు నియంత్రణకు కూడా తోడ్పడుతుంది. కాబట్టి పోషకాలు అధికంగా వున్న బాదములు వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకోవడం ప్రారంభించండి.
కరోనా తర్వాత ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవనశైలి దిశగా తమ ప్రయాణం ఆరంభించాయి. అయితే ఈ మార్పులను ఇలాగే నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఈ అలవాట్లను కుటుంబ సభ్యులందరూ అమలు చేయాలి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అల్పాహారంగా బాదంలు తీసుకోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి.