Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌
  • వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం
  • ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని
  • లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి
  • యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది

Mon 25 Jan 03:25:55.366347 2021

ఉద్యోగం చేసే మహిళలు చాలా మంది పిల్లలు పుట్టిన తరువాత ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటారు. పిల్లల్ని చూసుకోడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. . ఏదో చేయాలనే తపన.. ఆర్థికంగా తమకంటూ కొంత రాబడి ఉండాలనే కోరిక మాత్రం అందరి మనసుల్లో ఉంటుంది. పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలన్నా సాధ్యం కాకపోవచ్చు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం మొదలు పెట్టిన తరువాత కొంత టైమ్‌ కచ్చితంగా ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కాస్త తెలివి తేటలు.. మరికాస్త ఓపిక ఉంటే చాలు. ఎన్నో అవకాశాలు మనల్ని వెదుక్కుంటూ వస్తాయి. ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టవచ్చు. ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండానే మనకంటూ కొంత డబ్బు సంపాదించవచ్చు. దీనికి కావలసిందల్లా సమయం పాలనా, కష్టపడి పని చేసే తత్వం అంతే. ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి ఐడియాలు ఏమున్నాయ ఈరోజు తెలుసుకుందాం...

గిఫ్ట్‌ బాస్కెట్స్‌
గిఫ్ట్‌ బాస్కెట్స్‌ని తయారు చేయడం చాలా మంచి ఐడియా. కాస్త సృజనాత్మకత, ఇమాజినేషన్‌ ఉంటే ఈ బిజినెస్‌ గురించి ఆలోచించవచ్చు. పుట్టినరోజులు, పెండ్లిరోజులు, వేలంటైన్స్‌ డే, ప్రమోషన్స్‌ వంటి సందర్భాలకు ఎలాంటి గిఫ్ట్స్‌ ఇవ్వాలో ఐడియా ఉండడు ఒక్కోసారి. అంతే కాక రిటర్న్‌ గిఫ్ట్స్‌కి కూడా మంచి మార్కెట్‌ ఉంటుంది. ప్రస్తుతం పండుగలప్పుడు కూడా గిఫ్ట్‌ బాస్కెట్స్‌కి మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈవెంట్‌ని బట్టి గిఫ్ట్‌ బాస్కెట్‌ని క్రియేట్‌ చేయవచ్చు. మీకు భాష మీద పట్టు ఉంటే దీనికి సంబంధించిన నోట్స్‌ కూడా చక్కగా తయారు చేయవచ్చు. ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మీరు పదివేల రూపాయల వరకు పెట్టుబడి పెడితే సరిపోతుంది.

డే కేర్‌ సెంటర్‌

చిన్న పిల్లల కొరకు నడిపే డే కేర్‌ సెంటర్‌ కూడా మంచి ఐడియానే. ఈ మధ్య కాలంలో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోతోంది. మీరు గంటకి ఇంత అనీ తీసుకోవచ్చు.. లేదా నెలకి ఇంత అనీ తీసుకోవచ్చు. అయితే... ఇందుకోసం ప్రత్యేకంగా గది, పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు వంటివి అవసరమవుతాయి. ఈ పని చేయాలంటే కాస్త ఓపికా అలాగే కనీసంగా యాభై వేల పెట్టుబడి అవసరం కావచ్చు.
కొవ్వొత్తుల తయారీ
కొవ్వొత్తుల తయారీ కూడా చిన్న బిజినెస్‌ ఐడియాల్లో ఒకటి. ఆర్టిస్టిక్‌ ఔట్‌లుక్‌ ఉన్న వారికి బాగా నచ్చే బిజినెస్‌ ఇది. ఇంటర్నెట్‌లో చూస్తే డెకరేటివ్‌ క్యాండిల్స్‌ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. ఈ క్యాండిల్స్‌ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్‌ అన్నీ తేలికగా లభిస్తాయి. ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి మీకు ఐదువేల నుండి పదివేల వరకూ పెట్టుబడి అవుతుంది.
బ్యూటీ పార్లర్‌
ఇది మంచి బిజినెస్‌ ఐడియా కానీ.. దీనికి పెట్టుబడితో పాటూ ఇంకా కొన్ని అవసరం. మీరు బ్యూటీషియన్‌గా సర్టిఫై అయ్యి ఉండాలి. మీకొక బ్యూటీ సెలూన్‌ ఉండాలి. ఒక బిజినెస్‌ ప్లాన్‌ కావాలి. ఇవన్నీ ప్లాన్‌ చేసుకుని ప్రారంభిస్తే చక్కగా అభివృద్ధి చెందుతుంది.

క్యాటరింగ్‌

మీకు వంట బాగా వచ్చి ఉండి.. వంట అంటే ఇష్టముంటే మీ ఇష్టాన్నే మీరు ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ముందు మీకు తెసిన వారి దగ్గర నుండి ఆర్డర్స్‌ తీసుకుని నెమ్మదిగా పెద్దపెద్ద ఈవెంట్స్‌, సామాజిక కార్యక్రమాలకు క్యాటర్‌ చేయవచ్చు. మీరే ఒక ఎట్రాక్టివ్‌ మెనూ కూడా తయారు చేయవచ్చు. అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

కేక్‌ మేకింగ్‌

మీకు రకరకాల డిజైన్స్‌లో కేక్స్‌ చేయడం ఇష్టమైతే కేక్‌ సెల్లింగ్‌ బిజినెస్‌ ప్రారంభించండి. ఇప్పుడు ఏ చిన్న పార్టీ అయినా కేక్‌ కటింగ్‌ తప్పని సరిగా మారిపోయింది. మీరు తయారు చేసే ప్రతి కేక్‌కీ ఒక పేరు పెట్టి వాటిని మీరు ఎడ్వర్టైజ్‌ చేసుకోండి. వెబ్‌పేజ్‌, ఫేస్‌బుక్‌ పేజ్‌ క్రియేట్‌ చేసుకుని ప్రచారం చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉండే బేకరీల నుండి కూడా ఆర్డర్స్‌ తీసుకోవచ్చు.
బేక్డ్‌ గూడ్స్‌
కుకీస్‌, కప్‌ కేక్స్‌ వంటివి సంవత్సరమంతా డిమాండ్‌లో ఉంటాయి. చాకోలేట్స్‌ కూడా అంతే. మీకు ఇవి తయారు చేయడం వచ్చి ఉంటే మంచి లాభం సంపాదించవచ్చు. ఆన్లైన్‌ లో కూడా ఆర్డర్స్‌ తీసుకోవచ్చు. లోకల్‌ షాప్స్‌, డిపార్ట్మెంటల్‌ స్టోర్స్‌లో అమ్మవచ్చు. ఇందుకు ఐదువేల రూపాయల వరకూ పెట్టుబడి పెడితే సరిపోతుంది.
ట్యూటరింగ్‌
ప్రస్తుతం ట్యూషన్‌ చెప్పడం కూడా మంచి ఆదాయ వనరు. అన్ని వయసుల వారికి ట్యూటరింగ్‌ అవసరం ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్‌కీ కూడా ట్యూటర్స్‌ కావాలి. రకరకాల ఎంట్రన్స్‌ పరీక్షలకి ప్రిపేర్‌ చేయించడానికి కూడా వీళ్ళు అవసరం. మీకు ఉన్న డిగ్రీని బట్టి మీరు మీకు నచ్చే సబ్జెక్ట్‌లో ట్యూటరింగ్‌ స్టార్ట్‌ చేయవచ్చు. ఇందుకు మీకు ఎలాంటి పెట్టుబడీ అవసరం లేదు.
ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌
పేపర్‌తో ఫ్లవర్స్‌ చేయడం, మ్యూజిక్‌, పెయింటింగ్‌, డ్రాయింగ్‌ వంటి ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌లో ప్రవేశం, ప్రావీణ్యం ఉంటే మీరు ఈ ప్రావీణ్యాన్నే మీ సంపాదనా మార్గంగా ఎంచుకోవచ్చు. ఒకవేళ రాకపోయినా ఇంటర్నెట్‌ ద్వారా నేర్చుకొని ప్రారంభించవచ్చు. దీని కొరకు ఎలాంటి పెట్టుబడీ అవసరం లేదు.
టైలరింగ్‌
మీకు మంచి క్రియేటివిటీ ఉండి మీ బ్లౌజులూ, డ్రెస్సులూ మీరే డిజైన్‌ చేసుకోగలవారైతే ఇది మీకు సరిగ్గా సరిపోతుంది. మీరే కుట్టవచ్చు లేదా ఇంకెవరినయినా చేర్చుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా డిజైన్‌ డిసైడ్‌ చేయడం. ఇందుకు మీరు లేటెస్ట్‌ మోడల్‌ కుట్టు మిషన్‌ కావాల్సి ఉంటుంది. ఒక రూమ్‌ దీనికి కేటాయించగలిగితే ఇంకా మంచిది.
ఇంటీరియర్‌ డిజైనర్‌
ఈ పని చేయాలంటే మీకు చేతిలో కొంత సమయం, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉండాలి. ఎక్కడైనా ఇంటర్న్‌షిప్‌ చేసిన తరువాత మీ సొంత బిజినెస్‌ ప్రారంభించడం మంచిది.
కుకరీ క్లాసెస్‌
మీకు కుకింగ్‌ ఇష్టం ఉండి క్యాటరింగ్‌ బిజినెస్‌ మీద ఆసక్తి లేకపోతే మీరు దీని గురించి ఆలోచించవచ్చు. ఆన్లైన్‌లో కూడా క్లాసులు చెప్పవచ్చు, లేదా మీరు చేసిన వంటని వీడియో తీసి ఎడిట్‌ చేసి యూట్యూబ్‌లో పెట్టి డబ్బు సంపాదించవచ్చు.
చేయాలనే తపన ఉండాలే కానీ ఇలాంటి ఎన్నో కొత్త కొత్త ఐడియాలు పుట్టుకొస్తాయి. మీ సమయం, ఆసక్తి, నైపుణ్యాన్ని బట్టీ మీరేం చేయగలరో నిర్ణయించుకోండి. మరో ముఖ్య విషయం లాభనష్టాలు పూర్తిగా బేరీజు వేసుకున్నాకే ముందడుగు వేయండి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.