Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • భార్యా భర్తల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య
  • కరోనా వచ్చిందన్న జనం.. కొడుకు శవాన్ని భుజాన వేసుకుని..
  • రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతి.. అనాథ అయిన మూడేళ్ల కొడుకు
  • ఇండియా నుంచి వచ్చే ఫైట్లను రద్దు చేసిన ఆ దేశం
  • మొదలైన కర్ఫ్యూ.. ఖాళీగా రోడ్లు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?

Fri 19 Feb 04:18:45.579518 2021

ఆరోగ్యమే అన్నింటికంటే ఎక్కువ అన్న విషయం 2020 మనకు తెలిసేలా చేసింది. మన రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి వైరస్‌లనైనా ఎదుర్కోగలమని తెలియజేసింది. రోగనిరోధక వ్యవస్థ హానికరమైన వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే రోగనిరోధక వ్యవస్థని బలంగా మార్చుకోవడం ఒక్క రోజులో జరిగే పనికాదు. క్రమం తప్పకుండా ఆరోగ్యమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. మంచి అలవాట్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మనకు ఆరోగ్యం చేకూర్చడంలో సహాయపడతాయని గుర్తించుకోవాలి. దీర్ఘకాలం మెరుగైన ఆరోగ్యంతో జీవించాలంటే ఈ కింది అలవాట్లను క్రమం తప్పకుండా పాటించండి.
తరచుగా వ్యాయామం చేయండి
వ్యాయామం మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మెరుగైన ఆరోగ్యం కోసం శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు ఉదయం, సాయంత్రం వాకింగ్‌, వ్యాయామం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో పాటు యోగా, ప్రాణాయామాలు చేయండి. తద్వారా మనకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఒత్తిడికి లోనవ్వకండి
ఎక్కువ ఒత్తిడి మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మొదట్లో ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి, క్రమంగా శారీరక ఆరోగ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను ఎలా తగ్గించుకోవాలి? నిరాశకు లోనైనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి? మానసిక స్థితిని ఎలా మెరుగుపర్చుకోవాలి? అనే విషయాలపై అవగాహన పెంచుకోవాలి. మన రోజూ వారి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
బ్రేక్‌ ఫాస్ట్‌ మానేయొద్దు
ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడాన్ని ఏ పరిస్థితిలోనైనా మానేయకూడదు. ఎందుకంటే బ్రేక్‌ ఫాస్ట్‌ మనల్ని రోజంతా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇతర భోజనంతో పోలిస్తే ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాత్రంతా శరీరానికి ఆహారం అందక పోషకాలన్నీ అయిపోయే స్థితిలో ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ పోషకాలతో నిండిన బ్రేక్‌ ఫాస్ట్‌ని తీసుకోవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చు.
నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి
మెరుగైన ఆరోగ్యం కోసం రోజూ సరిపడా నిద్ర పోవడం తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సలహాలిస్తారు. రాత్రి ఆలస్యం చేయకుండా నిద్రపోయి ఉదయాన్నే లేచే వారిలో హార్మోన్లు ఎప్పుడూ సమతుల స్థాయిలో ఉంటాయి. తద్వారా మనలోని ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. సరైన నిద్ర లేకపోతే ఆరోజంతా నీరసంగా, ఆందోళనకరంగా ఉంటాము. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి 10 నుంచి 11 దాటక ముందే నిద్రపోవడం మంచిది. నిద్రకు కొన్ని గంటల ముందే భోజనం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
మంచి ఆహారం తీసుకోండి
ఆరోగ్యంగా ఉండటానికి తప్పనిసరిగా మంచి పోషకాలున్న ఆహారాన్నే తీసుకోండి. సమతుల్య ఆహారం మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. మన శరీరం, మనసు సజావుగా పనిచేయడానికి మనం తీసుకునే ఆహారం పట్ల తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. మన జీవనశైలిని మెరుగుపర్చడానికి తీసుకునే ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుందని గుర్తించుకోండి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ అలవాట్లు మానుకోండి
ఎలా డీల్‌ చేయాలి..?
రక్తపోటును నియంత్రిస్తాయి
ప్రతి అమ్మాయికీ అంకితం
జాగ్రత్తలు తీసుకోవాలి
పుదీనా తీసుకోండి
ఇంట్లోనే చేయొచ్చు
కాలంతో పాటు మారాల్సిందే
పక్కకు పెట్టకండి
తక్షణ శక్తినిస్తుంది
కళాఖండాలను సృష్టిద్దాం
ఉపవాసం చేస్తున్నారా..?
హ్యాండ్‌ వాష్‌ లేకపోతే...
పెరుగుతో పసందుగా
విజయం మీదే...
మైనింగ్లో మహిళలు
నిర్లక్ష్యం వద్దు
పండ్ల రసాలతో...
ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఈ నిమయాలు పాటిస్తూ...
పెరుగుతో మెరిసిపోండి
పుస్తకపఠనం నేర్పించండి
పోషకాహారం తప్పనిసరి
నైపుణ్యం ఉన్నా.. ప్రోత్సాహం సున్నా
పరగడుపున తాగండి
ఇకపై తప్పించుకోలేవు
వేసవి జాగ్రత్తలు
దాల్చినచెక్కతో...
సృజనాత్మకతను బయటకుతీద్దాం...
పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.