Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది మహిళలు ఆ విషయాన్ని గుర్తించరు. సమస్యలు తీవ్రమై, డాక్టర్ దగ్గరకు వెళ్లాక గానీ కండ్లు తెరవరు. అలా కాకుండా ముందే దాన్ని కనిపెడితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
- ప్రతి నెలా పీరియడ్స్ ఒకే సమయానికి రావాలి. అలా కాకుండా అటూ ఇటూ అవుతున్నా, అసలు రాకపోతున్నా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్లోన్ల అసమతుల్యత ఏర్పడినట్టే. దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే పీసీఓడీ సమస్య పరిగెత్తుకు వస్తుంది.
- నిద్ర పట్టడం పోవడం కూడా హార్మోనల్ ఇంబాలెన్స్కి సూచనే.
- మొటిమలు అందానికి సంబంధించిన సమస్య అనుకుంటారు చాలామంది. కానీ హార్మోన్ల అసమతుల్యతకీ మొటిమలకూ సంబంధం ఉంది. మొటిమలు వచ్చి ఎంతకీ తగ్గడం లేదంటే హార్మోన్ల సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు.
- హార్మోన్లు సరిగ్గా పని చేయకపోతే మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఆలోచనల్లో గందరగోళం, మతిమరుపు వంటి ఇబ్బందులు వస్తే ఓసారి చెకప్ చేయించుకోవడం మంచిది.
- ఉన్నట్టుండి బరువు పెరిగిపోవడం, హఠాత్తుగా సన్నబడి పోవడం జరుగుతుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
- డిప్రెషన్, ఊరికే మూడ్ మారిపోవడం వంటివి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అసమతుల్యత వల్ల జరగవచ్చు. మెదడులో విడుదలయ్యే సెరెటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్లను ఈస్ట్రోజన్ ప్రభావితం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయి.