Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోలీ రంగుల మరకలు పోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. వీటి తయారీలో వాడే హానికరమైన కృత్రిమ రసాయనాలు చర్మం, జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఈ రంగులు చర్మంపై ఏర్పడే మొండి మరకలను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని రకాల పదార్థాలతో వీటిని తొలగించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
- చర్మ సంరక్షణకు వాడుతున్న సున్నిపిండికి రంగుల అవశేషాలను తొలగించే శక్తి ఉంటుంది. దీన్ని ఇంట్లో సులశంగా తయారు చేసుకోవచ్చు. పసుపు, కర్పూరం, గులాబీ పొడి, బియ్యం, చందనం, నిమ్మ లేదా నారింజ తొక్కలను కలిపి పొడిగా చేసుకోవాలి. రంగుల మరకలు ఉన్న చోట ఈ పిండితో స్క్రబింగ్ చేసుకోవాలి. ఇది చర్మంపై మృత కణాలను సైతం తొలగిస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకున్నా ఫలితం ఉంటుంది.
- చర్మంపై రంగుల మరకలు ఉన్న ప్రాంతంలో నేచురల్ ఆయిల్స్‌తో మర్దన చేసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, బాదం నూనె వంటి సహజ నూనెలతో శరీరం, ముఖంపై మసాజ్ చేయాలి. దీనివల్ల రంగుల అవశేషాలు చర్మ రంధ్రాల్లోకి పోకుండా, పై పొరల్లోనే ఉంటాయి. బాగా మర్దన చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
- ముఖం, చర్మాన్ని రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవడం ద్వారా మొండి రంగులను వదిలించుకోవచ్చు. ముల్తానీ మట్టి లేదా సున్నిపిండిని వాడిన తర్వాత రోజ్‌వాటర్ వాడడం వల్ల చర్మం మెరుపును సంతరించుకుంటుంది. కనుబొమలపై ఏర్పడే మొండి రంగులను నిమ్మరసం సాయంతో తొలగించుకోవచ్చు. దూదిని నిమ్మరసంలో ముంచి కనుబొమలపై మర్దన చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.
- మొండి రంగులను మిసెల్లార్ వాటర్‌తో తొలగించుకోవచ్చు. ముఖం, కాళ్లు చేతులను నేచురల్ మిసెల్లార్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి. దీన్ని మేకప్ తొలగించడానికి కూడా వాడతారు. మార్కెట్లో లభించే ఆర్గానిక్ మిసెల్లార్ వాటర్‌ను ఎంచుకుంటే దుష్ప్రభావాలకు దూరంగా ఉండవచ్చు. ఇది చర్మంపై కనిపించే రంగుల మరలకను పూర్తిగా తొలగిస్తుంది. గోళ్లలో పేరుకుపోయే మొండి మరకలను కూడా వదిలిస్తుంది.
- జుట్టు, మాడుపై పేరుకునే రంగుల వ్యర్థాలను సహజ మార్గాల్లో తొలగించుకోవచ్చు. నిమ్మరసం, తులసి ఆకులు, అశ్వగంధ, శీకాకాయ పొడిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట వరకు ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే మొండి రంగులు వదులుతాయి. కొబ్బరి పాలు, పెరుగు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని కూడా ఇందుకు వాడవచ్చు. ఇవి సహజ కండిషనర్‌గా పని చేస్తాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకావు.