Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రివేళల్లో చాలామంది ఎక్కువగా తిని నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల బరువు మరింత పెరుగుతారు. అయితే.. బరువు తగ్గాలని అనుకునేవారు రాత్రిపూట మితంగానే ఆహారం తీసుకోవాలి. లేకపోతే అన్నం, రోటి పదార్థాలను దూరం చేసి ఇలాంటి స్నాక్స్ తినాలని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు.
- ముఖ్యంగా... త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తమం. అలాంటి వాటిలో అరటి పండు మంచిది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. దీంతో బరువు పెరిగే అవాకాశమే లేదు.
- కూరగాయల్లో దోసకాయ, క్యారెట్, బీట్రూట్ లాంటివి తినడం మంచింది. వీటితోపాటు శనగలు లాంటివి తీసుకోవడం ఉత్తమం. శనగలలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లతోపాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.
- పెరుగులో పండ్లని కలుపుకుని తింటే చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతోపాటు ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండు లాంటివి కలిపి తింటే ఇంకా మంచిది. దీనివల్ల ఆకలి వేయదని.. దీంతోపాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.