Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లం సన్నగా స్లైసెస్‌లా కట్ చేసి జ్యూస్ తియ్యండి. అందులో కొన్ని తులసి ఆకుల రసం వెయ్యండి. దాన్ని తాగేయండి. చేదుగా అనిపిస్తే కొద్దిగా తేనె కలుపుకోండి.
- చాలా మంది రాత్రివేళ పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగుతారు. ఆ అలవాటు మీకు లేకపోతే ఇకపై ప్రారంభించండి. పసుపు కలిపిన పాలలో నాలుగుకు మించకుండా బాదం పప్పులను కూడా వేసుకోవచ్చు. ఇది చాలు దగ్గు, జలుబు రెండూ పరార్.
- డికాక్షన్ కూడా జలుబు, దగ్గు అంతుచూస్తుంది. ఓ గ్లాస్ వాటర్ వేడి చెయ్యండి. నీరు ఉడుకుతున్నప్పుడు ఓ రెండు లవంగాలు, నాలుగు మిరియాలు, ఓ యాలిక, ఓ చిన్న అల్లం ముక్క, కొద్దిగా బెల్లం వెయ్యండి. మీడియం ప్లేమ్‌లో ఉడకనివ్వండి. మధ్యలో అటూ ఇటూ కదుపుతూ ఉండండి. నీరు సగానికి తగ్గగానే తులసి ఆకులు నాలుగు వెయ్యండి. కొద్దిగా టీపొడి వెయ్యండి. మరో నిమిషం ఉడికితే చాలు. ఫిల్టర్ చేసి... ఆ డికాక్షన్ తాగారంటే చాలు.
నీటిలో మిరియాల పొడి, జీలకర్ర, బెల్లం వేసి ఉడికించండి. ఫిల్టర్ చేసి తాగండి. రోజూ ఇలా తాగారంటే జలుబు, దగ్గు, గొంతులో కఫం కూడా పోతుంది.
- రోజూ టీ తాగుతారు కదా అందులో అల్లం ముక్క కూడా వేసి ఉడికించండి. అల్లం టేస్ట్ అదిరిపోతుంది. బాడీకి కూడా ఎంతో మేలు. దగ్గు నుంచి అల్లం కాపాడుతుంది.
- దాహంగా ఉన్న ప్రతిసారీ గోరు వెచ్చటి నీరు తాగే అలవాటు చేసుకోండి. ఫ్రిజ్ వైపు చూడకండి. గోరు వెచ్చటి నీరు ఎంత మంచిదంటే అది దగ్గు, జలుబు, కఫం రాకుండా చేస్తుంది. గొంతులో మంటను తగ్గిస్తుంది.
- వెల్లుల్లి కూడా దగ్గు, జలుబు, కఫంతో గట్టిగా పోరాడుతుంది. ఇందుకోసం ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో వేపండి. అవి కొద్దిగా రంగు మారేవరకూ వేపండి. ఇప్పడు వాటిని వేరే గిన్నెలో వేసి చల్లారనివ్వండి. ఆ తర్వాత బఠాణీలు నమిలినట్టు వాటిని నమిలేయండి. వెల్లుల్లి కాస్త చేదుగానే ఉంటుంది. కానీ దాని శక్తి మామూలుగా ఉండదు. చాలా త్వరగా జలుబు, దగ్గూ పారిపోతాయి. తిన్న తర్వాత చేదు పోవడానికి చిన్న బెల్లం ముక్క తినండి.
మార్కెట్‌కి వెళ్లినప్పుడు పుల్లటి పండ్లను కొనాలి. నిమ్మకాయలు కొనుక్కోవాలి. సీ విటమిన్ బాడీలో రోగాలు రాకుండా చేస్తుంది. దగ్గు, జలుబు వంటివి కూడా సీ విటమిన్ తీసుకునేవారిలో రావు. సీ విటమిన్ కోసం ఏ టాబ్లెట్‌లో అవసరం లేదు. అన్ని రకాల కూరగాయలు, పండ్లు వాడుతూ ఉంటే అదే వస్తుంది.