Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జామకాయలు మన ఆరోగ్యాన్ని అమాంతం పెంచేస్తాయి. వాటిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ మనకు ఎంతో మేలు చేస్తాయి. అదే విధంగా జామ ఆకులు కూడా మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. దీంతో తయారు చేసే టీ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకుల టీ పొడి ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో లభిస్తోంది. దీన్నే గ్వావా గ్రీన్ టీ అని కూడా పిలుస్తున్నారు. మరి దీన్ని ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.
తయారీకి కావాల్సినవి: పది జామ ఆకులు, ఏదైనా టీ పొడి పావు టీస్పూన్, గ్లాస్ వాటర్, తేనె లేదా బెల్లం.
తయారీ: ముందుగా జామ ఆకులను శుభ్రంగా కడగండి. ఇప్పుడు టీ పాత్రలో నీరు పోసి ఉడకనివ్వండి. నీరు బుడగలు వస్తున్నప్పుడు జామ ఆకులు వెయ్యండి. ఆకులను ముక్కలు చేసి వేస్తే మంచిది. ఐదు నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత టీ పొడి పావు టీ స్పూన్ వెయ్యండి. నీరు రంగు, రుచికరమైన వాసన వచ్చే వరకూ ఉడకనివ్వండి. ఇప్పుడు ఇంకొంచెం నీరు పోసి పది నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత వడగట్టి ఒకటిన్నర టీస్పూన్ తేనె లేదా బెల్లం వేసి కలిపి తాగండి.
జామ టీతో ప్రయోజనాలు: ఈ టీలో రోగాలను నియంత్రించే గుణాలు ఉన్నాయి. అలాగే మరో గుణం ఏంటంటే జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించగలవని న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం అనే జర్మల్లో తెలిపారు. అయితే ఈ టీని వరుసగా 8 వారాలపాటూ రోజూ తాగాలి. అప్పుడే బరువు తగ్గుతారు. అలాగే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ప