Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి కాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడుకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, వేసవితాపం, డీహైడ్రేషన్ బారినపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
- మాంసంలో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. అందువల్ల దీనికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్ జీర్ణ వ్యవస్థకు విఘాతం కల్గిస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో దీనికి దూరంగా ఉంటే.. ఉదర సమస్యలు కూడా తలెత్తవు. దీంతోపాటు మసాలా, కారం లాంటి పదార్థాలను తినకూడదు.
- వేపుళ్లకు దూరంగా ఉండాలి. వాటిని తినడం వల్ల కడుపు ఉబ్బినట్లు, నిండినట్లు అనిపిస్తుంది. తరచూ దప్పిక అవుతుంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. దీంతోపాటు టీ, కాఫీ వంటివి కూడా తాగకూడదు. వాటికి బదులుగా నిమ్మరసం, జీలకర్ర నీరు, మజ్జిగ, లస్సీ మొదలైనవి తీసుకుంటే మంచిది.
- వేసవి కాలంలో చల్లటి నీటిని తాగడం మానుకోవాలి. కూలింగ్ వాటర్ వల్ల మన దాహం తీరుతుందేమో కానీ.. చాలా వేడి ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకూ రిఫ్రిజిరేటర్లోని నీటికి దూరంగా ఉంటూ.. కుండలోని నీటిని తాగాలని సూచిస్తున్నారు.