Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ చాలా ఉంటాయి. అవి మన శరీరాన్ని రకరకాల వ్యాధులు సోకకుండా కాపాడతాయి.
- చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా ఉపయోగపడుతుంది. గుండెకు హాని జరగకుండా చేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేసేలా చూస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఈ టీ రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు తాగకూడదు. అలా తాగితే లివర్ సరిగా పని చెయ్యదు. గాయాలె నప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. దాల్చిన చెక్కలను వేడి నీటిలో 15 నిమిషాలు ఉంచి ఆ నీరు తాగితే మంచిది.
- అర స్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌ను ఒకటిన్నర గ్లాసుడు నీటిలో మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి. ఆపై తేనెను కలుపుకుని తీసుంటే దాల్చిన చెక్క టీ రెడీ అయినట్లే. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఓ కప్పు దాల్చిన చెక్క టీని సేవించడం ఉత్తమం.