Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవి వల్ల అందరికీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇక గర్బిణీలనైతే మకీ బాధిస్తాయి. సరిగ్గా తినలేక ఈ సమస్యకు గురవుతుంటారు. మానసికంగా కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు ఇటువంటి సీజన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం.
హైడ్రేషన్: కనీసం రోజులో మూడు లీటర్లు నీళ్లు తాగండి. లేదా లేతగా ఉండే కొబ్బరి నీళ్లు తాజాగా చేసిన జ్యూసులను తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు డయాబెటిస్ ఉంటే వీటిని తీసుకోవద్దు లేదా తక్కువ పంచదార వేసుకుని తీసుకోండి. మీరు సరిగ్గా సరిపడా నీళ్లు తాగారంటే హీట్ స్ట్రోక్ లాంటివి ఉండవు. పైగా మీరు డీహైడ్రేషన్‌కి గురవకుండా ఉండొచ్చు. కాబట్టి రోజులో తప్పకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. డైట్: ఎంత మంచి డైట్‌ని పాటిస్తే అంత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎక్కువగా ఆకు కూరలు, కాయగూరలు, నెక్స్ట్ గింజలు, సలాడ్, ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోండి. పెరుగు, మజ్జిగ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పుల్లటి వాటిని తీసుకోవద్దు. నూనె వాడకం తగ్గించండి. అలాగే ఎక్కువ నెయ్యకి, మసాలాలుకి దూరంగా వుండండి. వీలైనంత తక్కువ మసాలాలు తీసుకోవడానికి ప్రయత్నిచండి.
వ్యాయామం: రోజూ చేసే రొటీన్ ఎక్ససైజ్ని ప్రతీ రోజు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు ఎప్పుడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో ఆ సమయంలో చేయండి అదే మంచిది. ఎందుకంటే ఎండలో కష్టపడి పోతే నీరసం వస్తుంది.
కాళ్లను ఎత్తులో ఉంచుకోండి: కాళ్లను ఎత్తులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు బల్లని కానీ లేదా దిండుని కానీ ఉపయోగించండి. ఎత్తులో మీ పాదాలుని పెట్టడం వల్ల పాదాల్లో చేరే వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు వాటి మీద దృష్టి పెట్టండి. ఇలా ఎత్తులో పెట్టడం వల్ల నీటి శాతం తగ్గి పోతుంది. కాబట్టి ఎప్పుడూ అలానే కూర్చోవడం మంచిది.
బట్టలు, చెప్పులు: వేసవిలో టైట్ ఫిట్ లేదా సిల్కు బట్టలు ధరించడం మంచిది కాదు. వీలైనంత వదులైనవి, కాటన్‌వి ధరించడం, లైట్ కలర్స్‌ని వేసుకోవడం చేయండి. అలానే చెప్పులు కూడా కంఫర్ట్‌గా ఉన్న వాటిని ధరించండి. వీటి వల్ల స్పెల్లింగ్ అవకుండా ఉంటుంది.
నిద్ర పోవడం: మధ్యాహ్నం పూట కనీసం అరగంట సేపు పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో మీరు చక్కగా నిద్ర పోవడం మంచిది. అంతే కాని ఆ సమయంలో బయటకు వెళ్ళడం వంటివి చేయొద్దు.