Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. డీ హైడ్రేషన్, తల నొప్పి, వేడి వల్ల చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు వంటివి వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్క పనితో చెక్ పెట్టే వీలుందని మీకు తెలుసా? అవును. ఎండాకాలంలో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఎన్నో సమస్యలను తగ్గిపోతాయి. రోజులో మన శరీరానికి, చర్మానికి అవసరమైన హైడ్రేషన్ని అందించడంతో పాటు మరెన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే వేసవిలో తప్పకుండా దీన్ని తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..
తల నొప్పి తగ్గిస్తుంది: ఎండాకాలంలో మండే ఎండల వల్ల చాలామందికి తలనొప్పి సమస్య ఇబ్బంది పెడుతుంది. ఇలాంటివారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుంది.
డీటాక్స్గా పనిచేస్తుంది: శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజూ పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి.
మలబద్ధకాన్ని దూరం చేస్తుంది: మన శరీరానికి ఇబ్బంది కలిగించే ఎన్నో ఆరోగ్య సమస్యలకు రావడానికి ముఖ్య కారణంగా మలబద్ధకాన్ని చెప్పవచ్చు. రోజూ ఉదయాన్నే కలబంద జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. కలబంద మంచి లాక్సేటివ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం దూరమవుతుంది.
ఆకలిని పెంచుతుంది: చాలామందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటివారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది.
రక్తహీనత తగ్గిస్తుంది: చాలామందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవ్వడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి, రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది: కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం చాలామందికి తెలిసిన పద్ధతే. అయితే ఇలా చేయడంతో పాటు దాన్ని తాగడం వల్ల మీ చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ప