Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో పుస్తకాలు చదవడం కొంత వరకు తగ్గిపోయింది. అయితే పుస్తక పఠనం చాలా మంచి అలవాటు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ అలవాటును పెంచడం వారికెన్నో విధాలుగా మేలు చేస్తుంది. రీడింగ్ వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మెదడుకి ఇది మంచి వ్యాయామం. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఎబిలిటీ పిల్లల్లో చదవడం వల్ల కలుగుతుంది. అలాగే పిల్లల్లో ఊహాశక్తిని పెంచడంలో కూడా పుస్తక పఠనం సహాయం చేస్తుంది. మాట్లాడడంతో పాటు భాష పట్ల అవగాహన పెరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు కచ్చితంగా పిల్లలతో పుస్తకాలు చదివించాలి. మరి ఎలాంటి పుస్తకాలు చదివిస్తే మంచిదో తెలుసుకుందాం.
పిల్లలకి బ్లాక్ హీరోస్లకు సంబంధించిన పుస్తకాలను పరిచయం చేయండి. దీనిద్వారా ప్రపంచంలో విజేతలుగా నిలవడం అవసరమనీ, కలలను నిజం చేసుకోవడానికి తమ శరీర రంగు అవరోధం కాదన్న సంగతి పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. ఆఫ్రికన్ అమెరికన్స్‌ను హీరోలుగా చూపించిన ఈ స్టోరీస్ పిల్లలకు తమ భావాలను వ్యక్తపరచడానికి రంగు, రూపం అడ్డుకావన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.
బేబీ లవ్స్ గ్రావిటీ
రుత్ స్ప్రియో రాసిన ''బేబీ లవ్స్ గ్రావిటీ'' అనే పుస్తకంలో రచయిత పిల్లలకు అర్థమైన రీతిలో ఏంతో తెలివిగా గ్రావిటీకి సంబంధించిన అంశాలను టచ్ చేశాడు. తన పప్పీతో ఓ బాలుడికి ఉండే అనుబంధానికి ఈ కాన్సెప్ట్స్‌ను యాడ్ చేసి పిల్లలకు అర్ధమయ్యే భాషలోనే సింపుల్‌గా వివరించాడు. ఈ బుక్ పిలల్లకే కాదు పెద్దలకు కూడా ఉపయోగకరమే. ఇందులో ఇల్లస్ట్రేషన్స్ పిల్లల్ని ఆకర్షిస్తాయి.
మాయా ఏంజెలో: లిటిల్ పీపుల్, బిగ్ డ్రీమ్స్
రేసిజం అనే టాపిక్‌పై పిల్లలకు అవగాహన కలిగించడం పేరెంట్స్‌కు కష్టమైన విషయమే. లిటిల్ పీపుల్, బిగ్ డ్రీమ్స్ అనే స్టోరీ సిరీస్‌లో ఫేమస్ హిస్టారికల్ పీపుల్ గురించి హైలైట్ చేశారు. తిరస్కారాన్ని అలాగే కష్టాలను వారే విధంగా ఎదుర్కొన్నారో ఈ బుక్‌లో పిల్లలకు అర్ధమయ్యే భాషలో రచయిత ప్రస్తావించాడు.
ది వర్డ్ కలెక్టర్
ఈ పుస్తకం ద్వారా పిలల్లకు భాష ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని చెప్పగలం. కొంతమందికి స్టాంప్ కలక్షన్ హాబీ. మరికొంతమందికి కాయిన్స్‌ను కలెక్ట్ చేయడం హాబీ. మరి జెరోమ్ కున్న హాబీ ఏంటనేగా మీ సందేహం. జెరోమ్ వర్డ్స్‌ను కలెక్ట్ చేస్తాడు. పీటర్ హెచ్ రెనాల్డ్స్ రచించిన ఈ బుక్‌లో జెరోమ్ తన చుట్టూ ఉన్న పదాల్లోని మ్యాజిక్‌ను కనుగొంటాడు.
క్రౌన్: ఎన్ ఓడ్ టు ది ఫ్రెష్ కట్
డెరిక్ బేర్న్స్ రాసిన ''క్రౌన్: ఎన్ ఓడ్ టు ది ఫ్రెష్ కట్'' అనే బుక్‌లో సెన్సిటివ్ కాన్సెప్ట్స్‌ను సెన్సిటివ్ గానే టచ్ చేశారు. బార్బర్ షాప్‌లో మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ ఎంతోమందికి సంతోషాన్ని ఇస్తుంది. బ్లాక్ కమ్యూనిటీకి చెందినవారు ఇందుకు మినహాయింపు కాదు. చెదిరిపోయిన జుట్టుతో బార్బర్ షాప్‌కి వెళ్లిన పిల్లాడు చక్కటి హెయిర్‌కట్‌తో బయటికి వస్తే అమ్మ తన కొడుకును చూసి మురిసిపోతుంది. ఇవన్నీ మనసుకు హత్తుకునే సంఘటనలు. వీటిని పిల్లలకర్థమయే భాషలో రచయిత బాగా వివరించారు. మ్యాజిక్ ఎక్కడో కాదు బార్బర్ షాప్‌లోనే జరుగుతుందని తెలియచేశారు. పొయెటిక్ ఫార్మ్‌లో స్టోరీ సాగుతుంది. ఈ స్టోరీ ఒక మెసేజ్‌ను అంతర్లీనంగా అందిస్తుంది. ఇందులో ఉన్న ఇమేజెస్ పిల్లల్లో పాజిటివ్ ఇంపాక్ట్‌ను కలిగిస్తాయి.
ఎర్త్ మదర్
ప్రకృతి మాతకు అందరూ సమానమే. ప్రపంచమంతటినీ ఆదరిస్తుంది. ఎలెన్ జాక్సన్ రచనా శైలి పిల్లలను అలరిస్తుంది. ఇల్లస్ట్రేషన్స్ పిల్లల్ని కట్టిపడేస్తాయి. ఎలిమెంటరీ ఏజ్ పిల్లలకు ఇది రికమెండ్ చేయదగిన బుక్. ఆఫ్రికన్ మహిళల రూపంలో ప్రకృతి మాతను వర్ణించారు ఇందులో.
గ్రేస్ ఫర్ ప్రెసిడెంట్
ఈ బుక్‌లో లీడ్ క్యారక్టర్ పేరు గ్రేస్. ఈమె బ్లాక్ గర్ల్. వోటు ప్రాముఖ్యతను ఈమె తెలుసుకుంది. ఈ బుక్ ద్వారా అమెరికన్ పొలిటికల్ సిస్టమ్‌పై పిల్లలకు అవగహన లభిస్తుంది. కాంప్లెక్స్ టాపిక్‌ను రచయిత కెల్లీ డి పుచియో సింపుల్ లాంగ్వేజ్‌లో వివరించాడు.
యూ షుడ్ మీట్ క్యాథరిన్ జాన్సన్
''హిడెన్ ఫిగర్స్'' మూవీ మీకు నచ్చితే మీకు ''యూ షుడ్ మీట్'' సిరీస్ కచ్చితంగా నచ్చుతుంది. థియా ఫెల్డ్ మ్యాన్ రాసిన ఈ బుక్‌లో బ్రిలియంట్ మ్యాథ్మేటీషియన్ అయిన క్యాథరిన్ జాన్సన్‌కి సంబంధించిన విషయాలున్నాయి. ఇతని కేలిక్యులేషన్స్ నాసాకు హెల్ప్ చేసాయి. ఎంతగా అంటే చంద్రుడిలో మనిషి పాదం మోపగలిగేంతగా ఇతని అంచనాలు హెల్ప్ చేసాయి.
మార్టిన్స్ బిగ్ వర్డ్స్
సివిల్ రైట్స్ కోసం పోరాడగలుగుతున్నామంటే అందుకు సంబంధించిన ముఖ్యమైన డ్రైవింగ్ ఫోర్స్ గురించి తెలుసుకోవాలి. ''మార్టిన్స్ బిగ్ వర్డ్స్'' లో పిల్లలు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ గురించి తెలుసుకుంటారు. సమానత్వం గురించి అతని పోరాటాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. డోరీన్ రప్పాపోర్ట్ రాసిన ఈ బుక్కు అవార్డు కూడా వచ్చింది.
బిగ్ మామాస్
మనల్ని వేరు చేసే విషయాలకంటే కలిపి ఉంచే అంశాలు చాలా ఉన్నాయి. ఈ పుస్తకంలో సమ్మర్ వెకేషన్‌కు తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి తీసుకువెళ్లే ట్రెడిషన్ గురించి మెన్షన్ చేస్తారు. రచయిత డోనాల్డ్ క్రూస్ తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రతి సమ్మర్లో ట్రైన్లో తన అమ్మమ్మ వాళింటికి ఎలా వెళ్ళేవారో వివరించారు.
గాగుల్స్
బుల్లీయింగ్ అంటే ఎవరికీ నచ్చదు. ఈ బుక్ లో పీటర్, అర్కీ, విల్లీల సాహసాలను గమనించవచ్చు. వారికి ట్రెజర్ అనేది పాత మోటార్ సైకిల్స్ గాగుల్స్ రూపంలో దొరుకుతుంది. తన పక్కింటి బుల్లీస్ నుంచి వీరు ఈ ట్రెజర్ ను కాపాడుకోవాలి. ఎజ్రా జాక్ ఈ బుక్ ను రచించారు.
టీనేజ్ పిల్లల కోసం
పిల్లల్లో ఇమేజినేషన్ పవర్ యాక్టివ్‌గా ఉందా? అయితే ఈ ఫాంటసీ బుక్ వారి కోసమే. జట్టా ఎలీయెట్ రాసిన ఈ బుక్‌లో జాక్సన్ అనే చిన్నబాబుకు తన అమ్మమ్మతో సమయాన్ని స్పెండ్ చేయవలసిన అవసరం వస్తుంది. ఆమె గురించి భయంకర నిజం తెలుసుకుంటాడు.
మూన్ గర్ల్ అండ్ డెవిల్ డైనోసార్
కామిక్ బుక్స్‌ను ఇష్టపడేవారికి ఈ బుక్ బాగా నచ్చుతుంది. ప్రపంచాన్ని మార్చాలనుకునే ప్రీటీన్కు సంబంధించిన స్టోరీ ఇది. బ్లాక్ కలర్లో ఉన్న ఫోర్త్ గ్రేడర్ స్టోరీ ఇది. డైనోసార్‌తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. టీనేజ్ పిల్లలకు ఈ పుస్తకం బాగా నచ్చుతుంది.
ఏమజన్స్, ఆబొలిషనిస్ట్స్ అండ్ ఆక్టివిస్ట్స్
ఈ బుక్ అనేది కేవలం బ్లాక్ పీపుల్ గురించే కాదు, కానీ ఇందులో చాలామటుకు బ్లాక్ వుమన్ గురించి హైలైట్ చేయబడింది. చరిత్రలో మహిళల సహకారంతోనే ఎన్నో ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తించి తీరాలి. మహిళల హక్కులు, రేషియల్ ఇనీక్వాలిటీ వంటి కాన్సెప్ట్స్ పై పిల్లలకు అవగాహన వస్తుంది. మిక్కీ కెండల్ ఈ బుక్ రచించారు.