Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది బయటకు రావడానికి కూడా బయపడతారు ఎక్కడ ముఖం నల్లబడిపోతుందో అని. అలా అని ఎక్కడికీ వెళ్లకుండా ఉండలేము కదా. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసారిగా పాటించుకోవాలి. పెరుగు... ఈ వేసవిలో పెరుగు తింటే ఎంత చలవ చేస్తుందో మన ముఖారవిందాన్ని కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం.
- వేసవిలో ఎండ వల్ల నిరంతరం చెమట వస్తూనే ఉంటుంది. దీని వల్ల ముఖంపై రాషస్ రావడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును పట్టిస్తే చల్లగా ఉండటమే కాకుండా అందులో ఉండే జింక్ ముఖానికి ఉన్న టాన్ కూడా పోగొడుతుంది.
- సూర్యరశ్మి వల్ల ముఖంలో పోషణ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు అయిపోతుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
- పెరుగులో నారింజ లేదా కమలా పండు తొక్కల పొడిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.
- పెరుగులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రాసుకొని ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
- పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కు మాస్క్‌లా వేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.