Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిలో దొరికే పండ్ల రసాలలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దత సమస్య తొలగిపోతుంది, ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు, కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి, చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి, పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి, ఎసిడిటి, అల్సర్ సమస్యను నివారిస్తాయి.
- నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్లలో పోటాషియం బి6, బి1, బి2 విటమిన్స్ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతుంది. శరీరంలో నీటి శాతం పెరగడం వల్ల బరువు తగ్గొచ్చు.
- పుచ్చకాయలో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంటుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయి. ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇతర పదార్థాలు, కూల్డ్రింక్స్లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.
- ఈ జ్యూస్ల వల్ల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. పుచ్చకాయను జ్యూస్ కాకుండా అలాగే తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు. ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.