Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎండా కాలంలో ఉపవాసం అంటే చాలా కష్టం. ఎండ కారణంగా చాలా త్వరగా నీరసం వచ్చేస్తుంది. దానికి తోడు ఇప్పుడు కరోనా కారణంగా... పౌష్టికాహారం ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మరి ముస్లింలు రంజాన్ దీక్షలు ప్రారంభించారు కాబట్టి... వారు ఎలాంటి పండ్లు తీసుకుంటే... ఇటు దీక్షలు చెయ్యడానికీ, అటు కరోనాను దగ్గరకు రానివ్వకుండా చెయ్యడానికీ వీలవుతుందో తెలుసుకుందాం.
పియర్స్: ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువ. యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఒక్క పండు తిన్నా చాలు ఆకలి పోతుంది. ఇంకేదీ తినాలని అనిపించదు. పొట్టలో మంచి బ్యాక్టీరియాకి పియర్స్ చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియకు కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, కె, బి6, పొటోషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, ఫొలేట్ వంటివి ఎంతో మేలు చేస్తాయి.
యాపిల్: యాపిల్‌లో 80 శాతం నీరు ఉంటుంది. అలాగే ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉండే యాపిల్ చాలా ఆరోగ్యకరం. ఇందులో ఫైబర్ ఆకలిని చంపేస్తుంది. ఒక్క యాపిల్ తిన్నా చాలు చాలా సేపు ఆకలి వేయదు. ఉపవాసాలు చేసే చాలా మంది ఈ పండును సాహూర్ సమయంలో తింటారు. మిగతా పండ్లలో లాగే యాపిల్‌లోనూ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగానే ఉంటాయి.
కమలాలు: వేసవిలో దొరికే కమలాల్లో ఫైబర్ ఫుల్లుగా ఉంటుంది. ఇందులోని నీటి శాతంతో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. సాహూర్ సమయంలో దీన్ని తింటే ఎంతో ఆరోగ్యం, ఉల్లాసం కూడా ఉంటుంది.
ఆవకాడో: పై పండ్లతో పోల్చితే ఆవకాడో రేటు ఎక్కువే. కాకపోతే ఇందులో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువే. ఇది త్వరగా జీర్ణం కాదు. కాబట్టి ఎక్కువ సేపు పొట్టలో ఆహారం ఉన్న ఫీల్ కలిగిస్తుంది. కొన్ని గంటల పాటూ ఆకలి వెయ్యదు. ఇందులోని ఫ్యాట్స్, ఫైబర్ ఆకలి అంతు చూస్తాయి.
పుచ్చకాయ: పుచ్చకాయలో ఫైబర్‌తో పాటూ 92 శాతం నీరు ఉంటుంది. ఆహారం తినేసిన తర్వాత ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తే కడుపు నిండేవరకూ పుచ్చకాయ ముక్కల్ని తినేస్తే బెటర్. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువ. ఆకలి వెయ్యనివ్వదు. బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడుతుంది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే. విటమిన్ ఎ, సి, బి1, బి5, బి6, పొటాషియం, మెగ్నీషియం, కెరోటెనాయిడ్స్ వంటివి ఉండటం వల్ల సాహూర్ సమయంలో పుచ్చకాయ తినడం ఎంతో మేలు. పైగా జీర్ణక్రియకు కూడా ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.