Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది.
- చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
- కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరకు రసం దోహదం చేస్తుంది.
- చెరకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి.
- ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరకురసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.
- వేసవిలో చెరకు రసం తాగితే శరీరాన్ని చల్ల బరుస్తుంది.
- క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ గనుక ఊబకాయులూ తీసుకోవచ్చు.
చెరకు రసంలో నిమ్మ, అల్లం రసంగానీ, కొబ్బరి నీరుగానీ కలుపుకొని తాగితే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి.